పొట్టి వైట్ సూట్ లో రష్మిక స్టన్నింగ్!
పొట్టి సూట్ వేసుకున్న రష్మిక.. తన అందాలతో మైమరిపించింది. తన థైస్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని సింపుల్ గా పోజులిచ్చింది.
By: Tupaki Desk | 23 Sep 2024 10:30 PM GMTస్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. ప్రస్తుతం నార్త్ టు సౌత్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటోంది. తక్కువ టైమ్ లోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. స్టార్ స్టేటస్ ను కూడా దక్కించుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది. బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించింది. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. నేషనల్ క్రష్ గా తన టాలెంట్ ఏంటో చూపిస్తుంది.
కన్నడ కస్తూరి అయిన రష్మిక మందన్న సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తన సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటోంది. రీసెంట్ గా ఒక మూడు వారాలపాటు నెట్టింట ఎక్కడా కనిపించని అమ్మడు.. ఆ తర్వాత తనకు చిన్న ప్రమాదం జరిగిందని తెలిపింది. డాక్టర్ల సలహా మేరకు ఫుల్ గా రెస్ట్ తీసుకున్నానని పేర్కొంది. ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ గా మారింది రష్మిక మందన్న.
రీసెంట్ గా జరిగిన మిలన్ ఫ్యాషన్ వీక్ షోలో అదరగొట్టేసింది రష్మిక. ఈవెంట్ గా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. షో స్టాపర్ గా మెప్పించింది. తన గ్లామర్ షోతో ఫిదా చేసింది. బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ ఔట్ ఫిట్స్ లో సందడి చేసింది. ఇప్పటికే బ్లాక్ కలర్ డ్రెస్ లో దిగిన పిక్స్ ను నెట్టింట షేర్ చేసిన బ్యూటీ.. ఇప్పుడు వైట్ కలర్ సూట్ లో తీసుకున్న ఫోటోలు పోస్ట్ చేసింది. ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ డోనాటెల్లో వార్సెస్ డిజైన్ చేసిన ఆ ఔట్ ఫిట్ లో రష్మిక వేరే లెవల్ లో ఉంది.
పొట్టి సూట్ వేసుకున్న రష్మిక.. తన అందాలతో మైమరిపించింది. తన థైస్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని సింపుల్ గా పోజులిచ్చింది. తన గ్లోయింగ్ ఫేస్ తో అందరినీ క్లీన్ బౌల్డ్ చేసింది. నేషనల్ క్రష్ అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం అమ్మడి పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. అమ్మడు సూపర్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక్కో ఫోటో.. వేరే లెవల్ లో ఉందని కొనియాడుతున్నారు.
ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో విక్కీ కౌశల్ కు జోడీగా ఛావాలో యాక్ట్ చేస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేరలో నటిస్తోంది. గర్ల్ ఫ్రెండ్ మూవీలో దీక్షిత్ శెట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. త్వరలోనే బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సీక్వెల్ తో సందడి చేయనుంది. ఫస్ట్ పార్ట్ లో శ్రీవల్లిగా అందరి మనసులను దోచుకున్న రష్మిక.. ఇప్పుడు శ్రీవల్లి 2.0గా అలరించనుంది. మరి తన అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి హిట్స్ అందుకుంటుందో వేచి చూడాలి.