నా నిర్ణయాలకు నేనే బాధ్యురాల్ని
అయితే రిజల్ట్ ఏదైనా సరే దానికి బాధ్యత వహిస్తూ, తమ నిర్ణయాల్ని బేరీజు వేసుకుంటూ తర్వాతి స్టేజ్ కు వెళ్లడంలోనే సక్సెస్ ఉంటుంది.
By: Tupaki Desk | 29 March 2025 9:45 PMఇండస్ట్రీలో ఎవరెప్పుడు స్టార్లుగా మారతారో చెప్పలేం. ఒక చిన్న సినిమా కూడా నటుల్ని స్టార్లుగా మార్చేస్తాయి. అయితే రిజల్ట్ ఏదైనా సరే దానికి బాధ్యత వహిస్తూ, తమ నిర్ణయాల్ని బేరీజు వేసుకుంటూ తర్వాతి స్టేజ్ కు వెళ్లడంలోనే సక్సెస్ ఉంటుంది. ఈ విషయాన్ని తూ.ఛ తప్పకుండా పాటిస్తుంది సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.
ఒక యాక్టర్ ను స్టార్ గా చేసేది వాళ్లు సెలెక్ట్ చేసుకునే కథలేనని అంటోంది రష్మిక. కిర్రిక్ పార్టీ సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన రష్మిక తర్వాత తెలుగులోకి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఛలో సినిమా తర్వాత రష్మిక తెలుగులో సెటిలైపోయింది. పుష్ప, యానిమల్, పుష్ప2, ఛావా సినిమాలతో ఇండియన్ సినిమా క్వీన్ గా సత్తా చాటుతోంది రష్మిక.
రీసెంట్ గా బాలీవుడ్ లో ఛావా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ సినిమా చేస్తోంది. ఈ సినిమా రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సికిందర్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న రష్మిక పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
కొత్త ఛాలెంజెస్ ను తానెప్పుడూ స్వీకరిస్తానని చెప్తోన్న రష్మిక, సౌత్ లో ఉన్న పోటీ గురించి కూడా మాట్లాడింది. మీ ఎంపికలే మిమ్మల్ని నటుడి నుంచి స్టార్ గా మారుస్తాయని తాను ఓ బుక్ లో చదివానని, ఇప్పటికే కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేశానని, రానున్న రోజుల్లో మలయాళంలో కూడా నటించాలనుందని, ఆ ఛాన్స్ కూడా వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పిన రష్మిక ఏ భాషలో సినిమాలు చేయాలనేది తన ఛాయిస్ అని తెలిపింది.
ఇప్పటివరకు తాను చేసిన ప్రతీ సినిమా తన సొంత డెసిషనే అని, తనకు ఎవరూ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదని, కూర్గ్ లో పుట్టిన తాను మొదట కన్నడ ఇండస్ట్రీలో ఛాన్స్ అందుకుని తర్వాత వేరే భాషల్లో పలు సినిమాలు చేసినట్టు రష్మిక చెప్పుకొచ్చింది. తన జీవితం తనదే అని, తాను తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చే ఫలితమేదైనా సరే దానికి పూర్తి బాధ్యత కూడా తనదేనని, ఏ రంగంలోనైనా పోటీ ఉంటుందని, దాని గురించి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్లడమే అని రష్మిక తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే తాను ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలోని భాషనే మాట్లాడతానని చెప్పిన రష్మిక, హిందీలో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటానని తెలిపింది. మరికొన్ని గంటల్లో సికిందర్ తో ప్రేక్షకుల్ని పలకరించనున్న రష్మిక చేతిలో ప్రస్తుతం కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్ బో సినిమాలున్నాయి.