రష్మికను అందుకోవడం మిగిలిన వారికి కష్టమే
టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో కలిసి నటించిన రష్మిక నేషనల్ క్రష్ గా మారి దేశమంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది.
By: Tupaki Desk | 20 March 2025 11:37 AM ISTకిరిక్ పార్టీ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన రష్మిక అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో కలిసి నటించిన రష్మిక నేషనల్ క్రష్ గా మారి దేశమంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. తన అందం, నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న రష్మిక అశేషమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.
నేషనల్ వైడ్ లో ప్రస్తుతం రష్మికకు ఉన్న క్రేజ్ మరే హీరోయిన్ కు లేదు. అమ్మడు ఈ మధ్య పట్టిందల్లా బంగారమే అవుతుంది. తాను నటించిన ప్రతీ సినిమా ఎంతో క్రేజ్ తెచ్చుకోవడంతో పాటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు రష్మిక అందరికీ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక ఇండియన్ సినిమా క్వీన్ గా ఓ వెలుగు వెలుగుతోంది.
రష్మిక ఏ ముహూర్తాన పుష్ప సినిమా చేసిందో కానీ ఆ సినిమా తర్వాత నుంచి తన కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప నేషనల్ వైడ్ సక్సెస్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో చేసిన యానిమల్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద వండర్స్ సృష్టించింది. ఇక పుష్ప2 గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో దూసుకెళ్తున్న రష్మిక రీసెంట్ గా బాలీవుడ్ లో చేసిన ఛావా సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రష్మిక నుంచి తర్వాత రాబోయే సినిమాలపై బజ్ అమాంతం పెరిగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో దూసుకెళ్తున్న రష్మిక నుంచి త్వరలోనే సికిందర్ మూవీ వస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రష్మిక సెంటిమెంట్ కలిసొస్తుందని సల్మాన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సికిందర్ తో పాటూ రష్మిక చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. వాటిలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న కుబేర ఒకటి. అది కాకుండా రష్మిక ప్రధాన పాత్రలో నటించిన గర్ల్‌ఫ్రెండ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. దాంతో పాటూ రెయిన్ బో అనే సినిమాలో కూడా రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రష్మిక ఫేమ్, కెరీర్, క్రేజ్ ను చూసి మిగతా హీరోయిన్లు అసూయ పడే స్థాయిలో ఇప్పుడామె ఉంది. చూస్తుంటే ఇప్పట్లో రష్మిక స్థాయిని అందుకోవడం మిగిలిన వారికి కష్టమే అనిపిస్తోంది.