కవర్‌పేజీపై రష్మిక టోన్డ్ లెగ్ సౌందర్యం
కానీ తాజా కవర్ పేజీ ఎంతో ప్రత్యేకమైనదని ఇది చూశాక అర్థం చేసుకోవచ్చు.
By: Tupaki Desk | 14 Nov 2024 2:45 AM GMTఅవును.. మ్యాగజైన్ కవర్ పేజీపై రష్మిక మందన్న నెవ్వర్ బిఫోర్ లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిగ్గా మారుతోంది. ఈ బ్యూటీ ఇంతకుముందు చాలా ఫోటోషూట్లలో పాల్గొంది. కానీ తాజా కవర్ పేజీ ఎంతో ప్రత్యేకమైనదని ఇది చూశాక అర్థం చేసుకోవచ్చు. ఎప్పటిలానే రష్మిక ఫోజులు యూత్ ని కిల్ చేస్తున్నాయి. లేటెస్ట్ ఫోటోషూట్ కోసం రష్మిక ప్రిపరేషన్ ఆశ్చర్యపరుస్తోంది.
ప్రఖ్యాత గ్రాజియా మ్యాగజైన్ కవర్ పేజీపై రష్మిక మందన్న కవ్వింత తుళ్లింత వెబ్ ని సునామీలా చుట్టేస్తున్నాయి. ఫోటోగ్రఫీ పరంగా చూస్తే.. ఎంపిక చేసుకున్న డిజైనర్ దుస్తులు, ఎరుపు రంగు బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ గౌన్ కాంబినేషన్ స్టిల్ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోలో రష్మిక టోన్డ్ లెగ్ సౌందర్యం ప్రత్యేకంగా హైలైట్ అయింది. ఇక రెడ్ కలర్ చీటా టీషర్ట్... బ్లాక్ ఫ్రాక్ లో రష్మిక ఫోజులకు సంబంధించిన స్టిల్స్ ని ఇన్ స్టాలో షేర్ చేసారు. రష్మక అందం గ్లామర్ ఎలివేషన్ ని ఎంతో ఒద్దికగా కవర్ చేయడంలో ఈ ఫోటోషూట్ సఫలమైందని చెప్పాలి.
గ్రాజియా ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ .. తాను ఎప్పుడూ ప్లాన్ చేయలేదని, కానీ నటనతో ప్రేమలో పడ్డానని రష్మిక తెలిపింది. కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలోని కొండ పట్టణం విరాజ్పేట్కు చెందిన అమ్మాయి.. సైకాలజీ, ఆంగ్ల సాహిత్యంలో పట్టా తీసుకుంది. కానీ ఎలా షోబిజ్‌లో ఎలా అడుగుపెట్టింది? అంటే.. నేను నిజంగా నటనలోకి వెళ్లడం గురించి ప్లాన్ చేయలేదు.. కానీ నేను నటనతో ప్రేమలో పడ్డాను... అని తెలిపింది. జీవితం కొన్నిసార్లు ఊహించని ప్రణాళికలను కలిగి ఉంటుందని మీకు తెలుసా? అని ప్రశ్నించింది. కానీ నా విద్య (స్టడీస్) ఖచ్చితంగా నాకు తెరవెనుక చాలా సహాయపడింది. ఈ రంగంలో చాలా ఉపకరిస్తుందని తెలిపింది.
రష్మిక వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తోంది. పుష్ప 2 వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల కానుంది. సల్మాన్ సరసన సికందర్ చిత్రంలో నటిస్తోంది. నాగార్జున- ధనుష్ లతో కుబేర లోను నటిస్తోంది.