Begin typing your search above and press return to search.

రష్మిక నచ్చినా చేయలేకపోతుందట..?

ఈమధ్య కాలంలో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న హీరోయిన్ లు ఎవరు లేరని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   4 March 2025 9:00 AM IST
రష్మిక నచ్చినా చేయలేకపోతుందట..?
X

కన్నడ భామ రష్మిక మందన్న కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. అమ్మడు ఈమధ్య ఏ సినిమా చేసినా సరే అది ఒక రేంజ్ లో సక్సెస్ అవుతుంది. అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు పాన్ ఇండియా లెవెల్ లో వరుస సూపర్ హిట్లు అందుకుంటుంది రష్మిక. ఈమధ్య కాలంలో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న హీరోయిన్ లు ఎవరు లేరని చెప్పొచ్చు. రష్మిక సినిమాల సెలక్షన్ వాటి ఫలితాలు ఆమె రేంజ్ మరింత పెంచేస్తున్నాయి.

రష్మిక మందన్న లాస్ట్ ఇయర్ యానిమల్, పుష్ప 2 సినిమాలతో అదరగొట్టగా ఈమధ్య వచ్చిన ఛావా సినిమా తో కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. అదేంటో రష్మిక సినిమా అంటే చాలు బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. ఐతే పాన్ ఇండియా లెవెల్ లో వరుస హిట్లు కొడుతున్న రష్మిక ఈమధ్య ఒకటి రెండు అవకాశాలు వచ్చినా కాదనేస్తుందట.

రీసెంట్ గా టాలీవుడ్ నుంచి ఒక క్రేజీ మూవీ ఆఫర్ వచ్చిందట. కథ నచ్చింది.. స్టార్ హీరో, క్రేజీ డైరెక్టర్ కాంబో అయినా సరే వాళ్లు అడిగిన డేట్స్ ఇచ్చే అవకాశం లేక అమ్మడు సినిమా వదులుకుందట. సినిమా నచ్చి కూడా డేట్స్ అడ్జెస్ట్ చేసే ఛాన్స్ లేకనే అమ్మడు నో చెప్పేసిందట. ఐతే ఆ సినిమా లో హీరోయిన్ గా ఎవరు చేసినా సరే వాళ్లకు హిట్ పక్కా అని అనేస్తుందట.

రష్మిక ఖాతాలో ఇప్పటికే చేస్తున్న సినిమాలు కాక మరో 3 సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే అని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలు పూర్తి చేశాక కానీ రష్మిక మరో సినిమా ఓకే చేసే అవకాశం ఉందట. ఈలోగా ఎలాంటి సినిమా వచ్చినా కూడా అమ్మడు నో చెప్పక తప్పదని అంటుందట.

రష్మిక ప్రస్తుతం సికందర్, కుబేర, గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేస్తుంది. ఇవి పూర్తి కాగానే సల్మాన్ నెక్స్ట్ సినిమా కూడా రష్మికనే హీరోయిన్ అనేస్తున్నారు. సో వరుస సినిమాలు అమ్మడిని క్షణం తీరిక లేకుండా బిజీ బిజీ చేస్తున్నాయని తెలుస్తుంది. మిగతా హీరోయిన్సేమో ఒక హిట్ కొట్టడమే గగనం అనుకుంటున్న ఈ టైం లో రష్మిక ఇలా వరుసగా పాన్ ఇండియా సక్సెస్ లు అందుకోవడం చూసి వాళ్లంతా కుళ్లు కోవడం పనిగా పెట్టుకున్నారు.