Begin typing your search above and press return to search.

దెయ్యాల చుట్టూ రష్మిక..

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 12:53 PM GMT
దెయ్యాల చుట్టూ రష్మిక..
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన పుష్ప ది రూల్ మూవీ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అదే రోజు హిందీలో ఛత్రపతి శివాజీ కథతో తెరకెక్కిన చావా మూవీ ప్రేక్షకుల ముందుకి వస్తోంది. హిందీలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. యానిమల్ మూవీతో వచ్చిన క్రేజ్ రష్మిక మందనని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.

అందుకే ఓ వైపు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూనే మరో వైపు ఫిమేల్ సెంట్రిక్ సినిమా ఛాన్స్ లు కూడా రష్మిక సొంతం చేసుకుంటుంది. పుష్ప 2, చావా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా రష్మిక మందన లీడ్ రోల్ లో మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న కుభేర ఒకటి. ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే రెడీ అవుతోంది.

అలాగే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఒకటి సిద్ధం అవుతోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే హిందీలో ఇప్పుడు ఓ హర్రర్ జోనర్ సినిమాలో రష్మిక నటించబోతోందంట. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో హర్రర్ జోనర్ సినిమాలకి మంచి ఆదరణ వస్తోన్న నేపథ్యంలో రష్మిక మందన నటించబోయే సినిమా పైన కూడా హైప్ క్రియేట్ అయ్యింది.

వాంపైర్స్ ఆఫ్ విజయనగర టైటిల్ తో ఈ హర్రర్ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ రావు ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే స్త్రీ2తో రాజ్ కుమార్ రావు సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ కథాంశం హంపీ విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. ఆదిత్య సర్పోదర్ దర్శకత్వంలోనే ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఆదిత్య సర్పోదర్ ఈ ఏడాది ముంజ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు రష్మిక మందనతో ఏకంగా వాంపైర్స్ తో భయపెట్టడానికి సిద్ధం అవుతున్నాడంట 14వ శతాబ్దంలో ఈ కథ స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ వరకు ఉంటుందంట. డిఫరెంట్ టైం లైన్స్ లో ఈ సినిమా కథాంశం చెప్పబోతున్నారని అర్ధమవుతోంది. సినిమాలో ఆత్మలు దెయ్యాల హడావుడి గట్టిగానే ఉంటుందని టాక్. భారీ బడ్జెట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో రష్మిక దెయ్యంగా కనిపిస్తుందా లేదంటే రెగ్యులర్ పాత్రలో కనిపిస్తుందా అనేది చూడాలి.