హీరోతో స్వర్ణ దేవాలయంలో రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాలి గాయం కారణంగా షూటింగ్స్‌కి దూరంగా ఉంటుంది. త్వరలోనే పూర్తిగా కోలుకుని షూటింగ్‌కి జాయిన్ కావాలని ఆమె ప్రయత్నాలు చేస్తుంది.
By: Tupaki Desk | 11 Feb 2025 6:54 AM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్న కాలి గాయం కారణంగా షూటింగ్స్‌కి దూరంగా ఉంటుంది. త్వరలోనే పూర్తిగా కోలుకుని షూటింగ్‌కి జాయిన్ కావాలని ఆమె ప్రయత్నాలు చేస్తుంది. ఈ గ్యాప్‌లో రష్మిక 'చావా' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ మధ్య ఒక కార్యక్రమంలో వీల్ చైర్‌లో వచ్చి కనిపించిన రష్మిక మందన్న ఇప్పుడు ఆమె కాలు మరింత కుదుట పడినట్లు తెలుస్తోంది. చావా టీం మెంబర్స్‌తో కలిసి రష్మిక తాజాగా స్వర్ణ దేవాలయంను సందర్శించారు. ఆ సమయంలో రష్మిక సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. విక్కీ కౌశల్‌తో కలిసి రష్మిక అమృత్‌సర్‌లో సందడి చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
![](https://content.tupaki.com/h-upload/2025/02/11/689913-vic.gif)
విక్కీ కౌశల్, రష్మిక మందన్న స్వర్ణ దేవాలయం సందర్శించిన సమయంలో తీసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన చావా సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వీరిద్దరు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఇలా స్వర్ణ దేవాలయంను సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం తో పాటు అభిమానులతో ముచ్చటించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చావా సినిమా గురించిన అనుభవాలను పంచుకున్నారు. చావా సినిమా ఇద్దరికీ చాలా ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. చావా సినిమాపై తమ నమ్మకం వ్యక్తం చేశారు.
చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా సినిమాను రూపొందిస్తున్నారు. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా, శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించారు. ఇప్పటి వరకు శివాజీ మహారాజ్ జీవిత కథతో సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. మొదటి సారి శంభాజీ మహారాజ్ జీవిత కథపై సినిమా వస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. శివాజీ మహారాజ్ కి ఏమాత్రం తగ్గని పరాక్రమం శంభాజీ మహారాజ్ సొంతం అంటూ ఉంటారు. అలాంటి వీరుడి జీవిత కథను లక్ష్మణ్ ఉటేకర్ ఎలా రూపొందించారు అనేది ఆసక్తికరంగా ఉంది.
పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మరోసారి తన స్టార్‌డంను, సత్తాను చాటుకున్న రష్మిక మందన్న ఈ సినిమాలో యేసుబాయి పాత్రలో నటించడం ద్వారా అంచనాలు మరింత పెరిగాయి. మరి అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఉంటుందా... రష్మిక గత హిందీ చిత్రం 'యానిమల్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేసి బాలీవుడ్‌లో మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి. మరో వైపు రష్మిక టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తోంది. త్వరలోనే ఈమె నటించిన ధనుష్ కుబేరా సినిమా సైతం విడుదల కాబోతుంది.