'భాగస్వామి' ఎవరో క్లారిటీగా చెప్పవా ప్లీజ్ రష్మికా
తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్‌తో ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. తనకు సంతోషకరమైన ప్రదేశం అంటే ఏమిటో వెల్లడించారు.
By: Tupaki Desk | 28 Jan 2025 6:30 PM GMTగీత గోవిందం (2018), డియర్ కామ్రేడ్ (2019) చిత్రాలలో కలిసి నటించారు రష్మిక మందన- విజయ్ దేవరకొండ. వరుస చిత్రాల్లో కలిసి నటించడం.. సోషల్ మీడియాల్లో సన్నిహితంగా కలిసి ఉన్న పోస్ట్‌లను షేర్ చేయడం .. విజయ్ కుటుంబంతో రష్మిక సులువుగా కలిసిపోవడం.. విదేశీ వెకేషన్ నుంచి క్రిప్టిక్ ఫోటోలను షేర్ చేయడం.. వగైరా వ్యవహారాల కారణంగా అభిమానులు ఈ జంట రిలేషన్ షిప్ స్టాటస్పై పలు సందేహాలు వ్యక్తం చేసారు. ఆ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న ఊహాగానాలు సాగుతున్నాయి.
కానీ దానిని అంగీకరించనూలేదు.. అలాగని ఖండించనూ లేదు. తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్‌తో ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. తనకు సంతోషకరమైన ప్రదేశం అంటే ఏమిటో వెల్లడించారు. అదే సమయంలో తన రిలేషన్ షిప్ స్టాటస్ పైనా రష్మిక లీకులివ్వడం చర్చగా మారింది. రష్మిక ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే... ''గృహం నా సంతోషకరమైన ప్రదేశం. అది లంగరు వేసినంత సురక్షితం. నన్ను తాపీగా ఉంచుతుంది. విజయం వచ్చి వెళ్ళిపోతుంటుంది.. శాశ్వతం కాదు. కానీ ఇల్లు శాశ్వతం. కాబట్టి నేను ఇంటి నుంచే ప్రతిదీ చేస్తాను. నాకు లభించే ప్రేమ, ఈ కీర్తి దాని నుంచే.. నేను ఇప్పటికీ ఒక కుమార్తెను.. సోదరిని, 'భాగస్వామిని''... అని రష్మిక అన్నారు. నేను ఈ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తాను అని కూడా వ్యాఖ్యానించారు.
అయితే తాను మాట్లాడేప్పుడు ఫ్లోలో 'భాగస్వామి' అని ప్రస్తావించగా విజయ్‌తో రిలేషన్షిప్ గురించి ఊహాగానాలకు తెరతీసింది. ఒక మగాడు ఎలా ఉండాలో వివరిస్తూ.. అతడి కళ్లు ఆత్మకు కిటికీ అని అంటారు. నేను దానిని నమ్ముతాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండడం నా స్వభావం గనుక అలాంటి వ్యక్తులకు, వారి చుట్టూ ఉండేవారికి నేను ఆకర్షితురాలిని అవుతాను అని రష్మిక తెలిపారు.
విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్ షిప్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. షరతులు లేని ప్రేమ అంటే ఏమిటో చెప్పాడు. ప్రేమించబడటం అంటే ఏమిటో నాకు తెలుసు.. ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలుసు. అది షరతులు లేనిదో కాదో నాకు తెలియదు.. ఎందుకంటే నా ప్రేమ అంచనాలతో కూడుకున్నది అని అన్నారు. 35 వయసులో నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా? అని కూడా విజయ్ ఛలోక్తి విసిరాడు విజయ్. దీనిని బట్టి అతడు రిలేషన్ షిప్ లో ఉన్నాడని ఊహించారు. అయితే విజయ్ కానీ, రష్మిక కానీ డేటింగ్ గురించి ఇప్పటికీ అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. ఇవన్నీ ప్రస్తుతానికి మీడియా ఊహాగానాలు మాత్రమే.