వీడియో: ట్రైలర్ వేడుకలో కుంటుతూ రష్మిక కష్టం
కొందరు హీరోయిన్‌లు కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకుంటున్నా ప్రమోషన్స్ కి డుమ్మా కొడుతుంటారు.
By: Tupaki Desk | 22 Jan 2025 3:10 PM GMTకొందరు హీరోయిన్‌లు కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకుంటున్నా ప్రమోషన్స్ కి డుమ్మా కొడుతుంటారు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక డబ్బింగ్ దశలో, ప్రమోషన్స్ లో సహకరించని కథానాయికల గురించి పలువురు నిర్మాతలు వాపోయిన సందర్భాలున్నాయి. ఆరోగ్యం సహకరించినా హెల్త్ బాలేదని, నగరంలో అందుబాటులో లేమని ఎస్కేప్ అయ్యేవాళ్లు ఉన్నారు. ప్రమోషన్స్‌కి రాను అని ఖరాకండిగా ముందే ఒప్పందం చేసుకున్న కథానాయికలు ఉన్నారు.
కానీ అందుకు భిన్నంగా రష్మిక మందన్న ప్రమోషన్స్ విషయంలో బాధ్యతగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలికి తీవ్ర గాయమై నడవలేని పరిస్థితిలో ఉంది రష్మిక. అయినా తన సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతో బాధ్యతగా వెన్యూ వద్దకు వచ్చిన తనను చూసి అందరూ చలించిపోయారు. దెబ్బ తగిలిన కాలిని కింద పెట్టలేని పరిస్థితి. జిమ్‌లో తగిలిన దెబ్బ కాబట్టి ఇది చాలా తీవ్రమైనది. అయినా రష్మిక నేటి ఉదయం విమానాశ్రయంలో వీల్ చైర్ లోనే ప్రయాణించింది.
ఈ సాయంత్రం తాను నటించిన `చావా` ట్రైలర్ వేడుకలోను రష్మిక పాల్గొంది. అక్కడ వేదికపై కుంటుకుంటూ వెళుతూ మహేశ్వరునికి, శివలింగానికి నమస్కరించింది. నిలబడలేని స్థితిలో ఒంటి కాలిపై కుంటుతూ స్టేజీ పైకి వస్తున్న రష్మికకు చేయి అందించి సహనటుడు విక్కీ కౌశల్ తనకు ఎంతగానో సహకరించాడు. అలాగే వేదిక వద్దకు వచ్చే క్రమంలోనే తన సహాయకులు రష్మికకు సహకరించారు. కుంటుతూనే కార్యక్రమం అంతటా రష్మిక కనిపించింది. భారీ ఎంబ్రాయిడరీ డిజైన్ తో ఉన్న ఎరుపురంగు గౌనులో మహారాణిలా కనిపించింది.
చావా చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ కథతో రూపొందింది. ఇది భారీ వారియర్ చిత్రం. ఇందులో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించగా, అతడి భార్య రాణి పాత్రలో రష్మిక నటించింది. ఈ సినిమాలో నటించాను... ఇక రిటైర్ అయిపోయినా ఫర్వాలేదు.. అంత మంచి అవకాశం దక్కిందని ట్రైలర్ వేడుకలో రష్మిక ఎమోషనల్ అయింది. ఇటీవలే `పుష్ప 2`తో భారీ పాన్ ఇండియా హిట్ అందుకుంది. తదుపరి `చావా` పైనా రష్మిక బిగ్ హోప్‌తో ఉంది. ఈ చిత్రం పాన్ ఇండియన్ కేటగిరీలో అత్యంత భారీగా విడుదలకు సిద్ధమవుతోంది.