రష్మిక 400 కోట్ల సినిమా.. ఈసారి కష్టమే?
అయితే ఆమె విజయ పరంపర కొనసాగుతుందా లేక త్వరలో రాబోయే సికందర్ బ్రేక్ ఇస్తుందా అనే చర్చ నడుస్తోంది.
By: Tupaki Desk | 5 March 2025 11:01 PM ISTయానిమల్ 900 కోట్లు, పుష్ప 2 1800 కోట్లు, ఛావా 600 కోట్లు.. రష్మిక మందన్నా ఈ మూడు బ్లాక్ బస్టర్లతో తన స్థాయిని కొత్త లెవెల్ కి తీసుకెళ్లింది. ఇంకా ఛావా తెలుగు వెర్షన్ రిలీజ్ కాకపోవడంతో, ఈ సినిమాకు కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రష్మిక కేవలం టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఆమె విజయ పరంపర కొనసాగుతుందా లేక త్వరలో రాబోయే సికందర్ బ్రేక్ ఇస్తుందా అనే చర్చ నడుస్తోంది.
సల్మాన్ ఖాన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సికందర్ సినిమా భారీ అంచనాలతో రూపుదిద్దుకుంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కానీ మొదటి టీజర్ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. మురుగదాస్ లాంటి దర్శకుడు ఇంకొంత ఫ్రెష్ కాన్సెప్ట్ తో రావాలని ఫ్యాన్స్ భావించారు. కానీ టీజర్ చూస్తే సికందర్ చాలా రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్ గా కనిపిస్తోందని కామెంట్స్ వచ్చాయి.
తాజాగా విడుదలైన "జొహ్రా జబీన్" సాంగ్ సినిమాపై ఉన్న నెగటివ్ టాక్‌ను మరింత పెంచింది. సల్మాన్ ఖాన్ ఫిజిక్ ను చూపించేందుకు వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉపయోగించారనే విమర్శలు వస్తున్నాయి. అతని లుక్ నేచురల్ గా లేదని, గ్రాఫిక్స్ కారణంగా చాలా ఫేక్ గా కనిపిస్తోందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రష్మిక లుక్ కూడా ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోవడం లేదు. యానిమల్, పుష్ప 2, ఛావా వంటి సినిమాల్లో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉండగా, సికందర్ లో మాత్రం కేవలం గ్లామర్ షోకే పరిమితమైపోయిందనే భావన వ్యక్తమవుతోంది.
సల్మాన్ ఖాన్ సినిమాలకు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ ఈసారి సికందర్ పై ఉన్న నెగటివ్ టాక్ ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా రిలీజ్ కి ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో, మేకర్స్ మరింత స్ట్రాంగ్ ప్రమోషన్స్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రైలర్ ఎంతవరకు ప్రేక్షకుల మైండ్‌సెట్‌ను మార్చగలుగుతుందో చూడాలి.
ఇక రష్మిక కెరీర్ విషయానికొస్తే, ఆమె ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పరచుకుంది. కానీ సికందర్ లాంటి సినిమాలు ఆమె రేంజ్‌ను తగ్గించే అవకాశం ఉంది. బాక్సాఫీస్ హిట్ అయితే ఒకే కానీ, లేదంటే బాలీవుడ్ మార్కెట్‌లో ఆమె గ్రాఫ్ తగ్గే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ ఆమెకి చాలా కీలకం కానుంది. రష్మిక వరుసగా భారీ విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలో సికందర్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.