అక్కడ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక.. మ్యాటరెంటీ?
ఇక ఈ సినిమాని చూసేందుకు సెలబ్రెటీలు కూడా మొదటి రోజు తరలివెళ్లారు. ఇక రష్మిక ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి AMB మాల్ లో వీక్షించింది.
By: Tupaki Desk | 6 Dec 2024 7:25 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’కి మొదటి రోజు అనూహ్య స్పందన వచ్చింది. వరల్డ్ వైడ్ గా ఈ ఆడియన్స్ ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి చూపించారు. మొదటి రోజు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ఉహించని గ్రాస్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. నార్త్ ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న తెలుగు చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. ఈ మూవీ హిందీలో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. మేకర్స్ ఈ మూవీ లెక్కలు చెప్పేంత వరకు ఎంత వచ్చిందనేది స్పష్టత రాదు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా సూపర్బ్ పెర్ఫార్మెన్స్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘పుష్ప’ సినిమాతో రష్మికని పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఏకంగా హిందీలో వరుస అవకాశాలు అందుకుంది. ఇప్పుడు ‘పుష్ప 2’ పైన ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. పీలింగ్స్ సాంగ్ లో రష్మిక డాన్స్ పెర్ఫార్మెన్స్ అందరిని అలరించింది.
ఇక ఈ సినిమాని చూసేందుకు సెలబ్రెటీలు కూడా మొదటి రోజు తరలివెళ్లారు. ఇక రష్మిక ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి AMB మాల్ లో వీక్షించింది. ఆనంద్ దేవరకొండ, విజయ్ తల్లిదండ్రులతో కలిసి రష్మిక సినిమా చూడటానికి వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం నడుస్తోంది.
చాలా సార్లు వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, రష్మిక కూడా పరోక్షంగా వారి రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చారు. కానీ దేవరకొండ పేరు డైరెక్ట్ గా ఎత్తడం లేదు. ఇక ‘పుష్ప 2’ ఈవెంట్ లో రష్మిక తన రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ ఆ విషయం అందరికి తెలుసని వ్యాఖ్యలు చేసింది. విజయ్ కూడా తాను ఆల్రెడీ ఒకరితో డేటింగ్ లో ఉన్నట్లు గతంలో చెప్పాడు. దీంతో రకరకాల అభిప్రాయాలు వైరల్ అవుతున్నాయి.
రష్మిక కూడా హైదరాబాద్ వచ్చినపుడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీతోనే కలిసి ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. తాజాగా ‘పుష్ప 2’ రిలీజ్ రోజు విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి రష్మిక ఈ సినిమాని వీక్షించడానికి వెళ్లడంతో రౌడీ స్టార్, రష్మిక రిలేషన్ పై మరోసారి చర్చ నడుస్తోంది.