Begin typing your search above and press return to search.

ర‌ష్మిక బ్యూటీ సీక్రెట్ ఇదేనా?

నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి? ఠ‌క్కున గుర్తొచ్చేది జిమ్ . క్ర‌మం త‌ప్ప‌కుండా ఉద‌యాన్నే వ‌ర్కౌట్ల‌తో డే మొద‌లు పెడుతుంది.

By:  Tupaki Desk   |   24 Nov 2023 6:51 AM GMT
ర‌ష్మిక బ్యూటీ సీక్రెట్ ఇదేనా?
X

నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి? ఠ‌క్కున గుర్తొచ్చేది జిమ్ . క్ర‌మం త‌ప్ప‌కుండా ఉద‌యాన్నే వ‌ర్కౌట్ల‌తో డే మొద‌లు పెడుతుంది. అందులోనూ సుల‌వైన వ‌ర్కౌట్లు చేసి స‌రిపెడుతుంద‌టే పొర‌బ‌డిన‌ట్లే! అమ్మ‌డు అధిక బ‌రువుల్ని సైతం సునాయాసంగా ఎత్తేస్తుంది. ర‌ష్మిక ఎత్తు..బ‌రువు మించిన బురువుల్ని ట్రైన‌ర్ల స‌మంక్షంలో ఎత్తుతుంది. ఉదాయాన్నే రెండు గంట‌ల స‌మ‌యం కేవ‌లం జిమ్ కే కేటాయిస్తుంది.

షూటింగ్ సెట్స్ లో ఉంటే ? అక్క‌డా డేని అలాగా ప్రారంభిస్తుంది. స్పాట్ లో దొరికిన వ‌స్తువుల్నే జిమ్ వ‌స్తువులుగా మ‌లుచుకుంటుంది. అలా జీవితంలో జిమ్ ని ఓ నిత్య‌కృత్యంలా మార్చేసింది. ఇక ఆహార‌పులు అల‌వాట్లు అంతే క‌ఠినంగా ఉంటాయి. సుంతులిత ఆహారం తీసుకుంటుంది. జిమ్ సెష‌న్ పూర్త‌యిన వెంట‌నే రిఫ్రెష్ యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ తీసుకుంటుంది. రోజంతా తన ఆహారంలో సీజనల్ పండ్లు.. చిలగడదుంపలు .. కూరగాయ‌లు ఉండేలా చూసుకుంటుంది. అలాగే ప్యాక్ చేసిన సూప్‌లు తీసుకుంటుంది.

డైట్ లో సరళమైన -పోషకమైన ఆహారాలను చేర్చుకోవడంపై దృష్టి పెడుతుంది. అమ్మ‌డి షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా డైట్ విష‌యంలో ప‌క్కాగా ముందే ప్లాన్ చేసుకుంటుంది. ఔట్ డోర్ షూటింగ్ ఉంటే కావాల్సిన వాటిని ముందుగానే రెడీ చేసి ప్యాక్ చేసి పెట్టుకుంటుంది. ఇలాంటి స‌మ‌యంలో ఎక్కువ‌గా విటమిన్లు -ఖనిజాలు సరఫరా చేసే పుడ్ తీసుకుంటుంది. ఇంటి భోజ‌న‌మే తీసుకుంటుంది.

ఎక్కువ‌గా ప్రాసెస్ చేయ‌ని ప‌దార్ధాలు తీసుకుంటుంది. అకేష‌న‌ల్ గానే జంక్ ఫుడ్ జోలికి వెళ్తుంది. అదీ అతి కొద్ది మోతాదులోనే తీసుకుంటుంది. ఇలా అమ్మ‌డు ఎప్పుడూ శ‌ర‌రీరంలో ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెంచుకునే ప‌దార్దాలే ఎక్కువ‌గా తీసుకుంటుంది. ఇవ‌న్నీ చేస్తుంది కాబ‌ట్టే అమ్మ‌డు మెరిసిపోతుంది. యువ‌తలో అంత‌టి పాపులారిటీని సొంతం చేసుకుంది.