Begin typing your search above and press return to search.

సౌత్ లో రష్మిక మందన్న మాత్రమే మరీ ఇంత...!

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న జోరు కంటిన్యూ అవుతోంది. బాలీవుడ్‌ లో ఇప్పటికే చేసిన సినిమాలు నిరాశ పరిచినా కూడా తాజాగా వచ్చిన యానిమల్‌ సినిమా తో అక్కడి ప్రేక్షకులను అలరించింది.

By:  Tupaki Desk   |   5 Dec 2023 6:10 AM GMT
సౌత్ లో రష్మిక మందన్న మాత్రమే మరీ ఇంత...!
X

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న జోరు కంటిన్యూ అవుతోంది. బాలీవుడ్‌ లో ఇప్పటికే చేసిన సినిమాలు నిరాశ పరిచినా కూడా తాజాగా వచ్చిన యానిమల్‌ సినిమా తో అక్కడి ప్రేక్షకులను అలరించింది. ఇంతకు ముందు వచ్చిన హిందీ సినిమాలతో ఆశించిన స్థాయి విజయాలను సొంతం చేసుకోలేక పోయిన రష్మిక కి యానిమల్ సినిమా బాలీవుడ్ లో రాణించేందుకు బూస్ట్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.

రష్మిక కి నేషనల్‌ క్రష్ అనే ట్యాగ్‌ ను అభిమానులు ఇచ్చారు.. ఆ ట్యాగ్ కి ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్ లో హిందీ, తెలుగు, తమిళ ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడి సినిమాల జోరు కంటిన్యూ అవుతోంది. తాజాగా రష్మిక మందన్న గర్ల్‌ ఫ్రెండ్‌ అనే సినిమా ను కమిట్ అయింది, ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల జరిగాయి.

నిన్న మొన్నటి వరకు యానిమల్‌ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో హీరోతో సమానంగా చాలా యాక్టివ్‌ గా పార్టిసిపేట్‌ చేసిన రష్మిక చిన్న బ్రేక్ తీసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఏమాత్రం బ్రేక్ లేకుండా నేటి నుంచి గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా షూటింగ్‌ కోసం కొత్త సెట్స్ లో జాయిన్ అయింది. 20 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ ఉంటుందట.

ఈ గ్యాప్ లో విజయ్ దేవరకొండ కోసం 'ఫ్యామిలీ స్టార్‌' సినిమా లో చిన్న గెస్ట్‌ అప్పియరెన్స్ కూడా ఇచ్చిందట. మొత్తానికి ఇంత బిజీగా సౌత్ సినీ ఇండస్ట్రీలో కేవలం రష్మిక మందన్న మాత్రమే ఉండి ఉంటుంది. శ్రీలీల కూడా బిజీగా ఉంది కానీ.. ఆమె తెలుగు సినిమాల్లో మాత్రమే వరుసగా నటిస్తూ ఉంది.

రష్మిక మాత్రం ఆ భాష.. ఈ భాష అనే తేడా లేకుండా అన్ని భాషల సినిమాల్లో కూడా నటిస్తూ సందడి చేస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు, నటన విషయంలో విమర్శకులను సైతం మెప్పించగల ప్రతిభ ఈ అమ్మడి సొంతం. అందుకే ఇంత బిజీగా రష్మిక మందన్నా దూసుకు పోతుంది.