Begin typing your search above and press return to search.

వారి కోరిక కాదనలేక పోతున్నా : రష్మిక

ఈ అమ్మడు ఏ భాష సినిమా ఫంక్షన్‌ కి హాజరు అయితే ఆ భాష మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

By:  Tupaki Desk   |   29 May 2024 12:39 PM
వారి కోరిక కాదనలేక పోతున్నా : రష్మిక
X

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న కి అన్ని భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం రష్మిక కేవలం తెలుగు భాషలోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు ఏ భాష సినిమా ఫంక్షన్‌ కి హాజరు అయితే ఆ భాష మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

తాజాగా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు హాజరు అయిన రష్మిక మందన్న తెలుగు లో మాట్లాడింది. ఆమె ఢిల్లీ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా మీరు మాట్లాడే మాటలు మాకు అర్థం కావడం లేదు, కనుక మీరు ప్రతి ఈవెంట్‌ లో కూడా ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఆ విషయమై రష్మిక మందన్న స్పందిస్తూ... నన్ను అభిమానించే వారు అన్ని భాషల్లో ఉన్నారు. వారిలో చాలా మంది వారి వారి స్థానిక భాషలో నేను మాట్లాడితే వినాలని, చూడాలని కోరుకుంటారు. అందుకే వారిని నిరాశకు గురి చేయకుండా, వారి కోరిక కాదనలేక భాష రాకున్నా కూడా స్థానిక భాషలో మాట్లాడుతాను.

ఇంగ్లీష్ లో మాట్లాడాలని భావించినా కూడా స్థానిక ప్రేక్షకుల కోరిక మేరకు వారి భాషలో మాట్లాడేందుకు నేను ప్రయత్నిస్తాను అన్నట్లుగా రష్మిక చెప్పుకొచ్చింది. ఇది మంచి విషయమే కానీ, ఒక భాష సినిమా వేడుకలో పాల్గొన్న సమయంలో మరో భాష ఫ్యాన్స్‌ ఆ వీడియోలను చూసి అర్థం చేసుకోవడం ఎలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం రష్మిక నటిస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంది. ముఖ్యంగా ఈ అమ్మడు పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. మరో వైపు రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తుంది. ఆ సినిమాల్లో ఒకటి ఈ ఏడాది, రెండోది వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.