Begin typing your search above and press return to search.

'యానిమల్' లాంటి హస్బెండ్.. ఇప్పుడేంటి రచ్చ?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ప్రస్తుతం సౌత్ టు నార్త్ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   13 Jun 2024 10:29 AM GMT
యానిమల్ లాంటి హస్బెండ్.. ఇప్పుడేంటి రచ్చ?
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ప్రస్తుతం సౌత్ టు నార్త్ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. గతేడాది యానిమల్ మూవీతో వచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఆ సినిమాలో గీతాంజలి పాత్రలో నటించి ఓ రేంజ్ లో అలరించింది. ఇండియన్ బాక్సాఫీస్‌ ను ఒక్కసారిగా షేక్ చేసిన ఆ మూవీ.. రూ.900 కోట్ల పైగా వసూళ్లు రాబట్టి భారీ లాభాలు అందించింది.


అయితే ఆ సినిమాకు గాను సందీప్ రెడ్డి వంగా ఎన్ని ప్రశంసలు అందుకున్నారో.. అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అనేక మంది సెలబ్రిటీలు సినిమాపై పెదవి విరిచారు. స్త్రీలను తక్కువగా చేసి చూపించారని కొంత మంది ఆరోపించారు. కొన్ని అనవసరమైన సీన్లు పెట్టారని అన్నారు. కానీ మూవీ మాత్రం.. థియేటర్లతో పాటు నెట్ ఫిక్స్ ఓటీటీలో కూడా ఓ రేంజ్ లో దూసుకుపోయింది. మంచి వ్యూస్ దక్కించుకుంది.

ఇక ఈ సినిమాలో రష్మిక రోల్ ను అనేక మంది ప్రశంసించారు. మరో మహిళతో సంబంధం ఉన్న విషయం తెలిసి కూడా ఒప్పుకోవడం గ్రేట్ అని అన్నారు. కొందరు రోల్ ను మరింత బోల్డ్ గా చూపించారని విమర్శించారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సినిమాలో గీతాంజలి(రష్మిక)తో ప్రేమలో పడ్డ తర్వాత విజయ్ (రణబీర్).. జోయా(త్రిప్తి డిమ్రీ)ను మోసం చేసిన దాన్ని వీడియో రూపంలో షేర్ చేశారు.

"గుర్తుంచుకోండి: మనిషిని నమ్మడం కంటే భయంకరమైనది ఏదీ లేదు" అంటూ యూజర్ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో రష్మిక.. స్పందించింది. "కరెక్షన్ : స్టుపిడ్ ను నమ్మితే భయంకరం.. చాలా మంది మంచి పురుషులు కూడా ఉన్నారు. వారిని నమ్మడం ప్రత్యేకం" అని లవ్ ఎమోజీని మెన్షన్ చేసి కామెంట్ చేసింది. దీంతో యానిమల్ ను కేవలం సినిమాగానే చూడాలని ఇన్ డైరెక్ట్ గా తెలిపింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ వైరల్ గా మారింది

ఇక రష్మిక వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ గా గడుపుతోంది. ఖాళీ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటోంది. ఆమె షెడ్యూల్ చాలా బిజీగా ఉంటోంది. ఆమె నటిస్తున్న పుష్ప -2 త్వరలోనే విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీవల్లి 2.0గా అలరించనుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన సూసేకి సాంగ్ అండ్ ఫస్ట్మం లుక్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో పాటు రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, కుబేర తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. మరి వరుస సినిమాలతో నేషనల్ క్రష్ ఎలాంటి హిట్లు అందుకుంటుందో చూడాలి.