Begin typing your search above and press return to search.

రిలీజ్ కి ముందు శ్రీవ‌ల్లి క్యూట్ ట్రీట్!

అంద‌మైన క‌ళ్లు..ముక్కు..పెదాల‌తో ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ రిలీజ్ వ‌ర‌కూ చిల్ అవ్వండని వ‌దిలింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 3:00 PM GMT
రిలీజ్ కి ముందు శ్రీవ‌ల్లి క్యూట్ ట్రీట్!
X

'యానిమ‌ల్' లో ర‌ష్మిక పెర్పార్మెన్స్ ఎలా ఉంటుంద‌న్న‌ది త‌ర్వాత సంగ‌తి! ముందు అమ్మ‌డు తెర‌పై ఎంత అందంగా..ఎంత హాట్ గా క‌నిపిస్తుంది? అన్న‌ది అభిమానుల్లో ప్ర‌ధానంగా సాగుతోన్న ముచ్చ‌ట‌. బ్యూటీని తెర‌పై చూసి కొన్ని నెల‌లు గ‌డుస్తుంది. గ‌తేడాది 'సీతారామం'లో గెస్ట్ పాత్ర త‌ర్వాత తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. అందులో డీసెంట్ రోల్ లో కనిపించింది. ముస్లీం యువ‌తి పాత్ర కావ‌డంతో గ్లామ‌ర్ కి ఛాన్స్ లేకుండా పోయింది.


ఇక హిందీలో కొన్ని సినిమాలు చేసినా అవి అక్క‌డికే ప‌రిమిత‌య్యాయి. వాటిలోనూ డీసెంట్ పాత్ర‌లు కావ‌డంతో! శ్రీవ‌ల్లి చ‌మ‌త్కారాలు చూసి చాలా కాల‌మైపోయింద‌న్న ఫీలింగ్ అభిమానుల్లో ఉంది. ఇక యానిమ‌ల్ లో అమ్మ‌డి హాట్ లుక్ రివీల్ అయిన ద‌గ్గ‌ర నుంచి ఒక‌టే ఎగ్జైట్ మెంట్ మొద‌లైంది.


'అర్జున్ రెడ్డి' హీరోయిన్ లా 'యానిమ‌ల్' లో క‌నిపిస్తుందా? అని ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. కుర్రాళ్ల‌లో ఇప్పుడిదే అంశం వాడి వేడి చ‌ర్చ‌కు దారి తీస్తుంది. అందుకు ఇంకా ఆరు రోజులే స‌మ‌యం ఉందంటూ అమ్మ‌డు ఇలా ఇన్ స్టాలో కొత్త ఫోటోని షేర్ చేసింది. ఇదిగో ఇక్క‌డిలో ఔట్ ఫిట్ లో క్యూట్ గా కెమెరాకి ఓ ఫోజు ఇచ్చింది.

అంద‌మైన క‌ళ్లు..ముక్కు..పెదాల‌తో ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ రిలీజ్ వ‌ర‌కూ చిల్ అవ్వండని వ‌దిలింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. మై క్ర‌ష్‌..మైల‌వ్ ...మై బ్యూటీ అంటూ ర‌ష్మిక‌ని తెగ ఆరాదిస్తున్నారు. కొద్ది రోజులుగా అమ్మ‌డు 'యానిమ‌ల్' ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'పుష్ప' త‌ర్వాత మ‌రో స‌క్సెస్ ఖాతాలో వేసుకోవ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు గెస్ చేస్తున్నారు.