రష్మిక బర్త్‌డే... ఆ విషయంలో ఫ్యాన్స్ కోపం
ప్రస్తుతానికి రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా ది గర్ల్ ఫ్రెండ్ నుంచి పోస్టర్ మాత్రమే రాబోతుంది.
By: Tupaki Desk | 5 April 2024 4:11 AM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్న నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటుంది. సోషల్ మీడియాలో అర్థ రాత్రి నుంచే ఫ్యాన్స్ హడావుడి మొదలు అయ్యింది. ఆమె ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ నెట్టింట సందడి చేస్తున్నారు. ఆమె బర్త్ డే స్పెషల్ గిఫ్ట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ముందుగా అనుకున్న ప్రకారం ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ తో రష్మిక ఫ్యాన్స్ కి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాడు. కానీ ప్రస్తుతం రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం అబుదాబి లో ఉంది. ఆమె లేకపోవడం వల్ల టీజర్ విడుదల వాయిదా వేశారని సమాచారం అందుతోంది.
హైదరాబాద్ లో ఫ్యాన్స్ సమక్షంలో భారీ ఈవెంట్ ను నిర్వహించి 'ది గర్ల్ ఫ్రెండ్' టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే టీజర్ ను ఆమె బర్త్ డే సందర్భంగా విడుదల చేయలేక పోయారు. ఈ నెలలోనే ఒక మంచి సమయం చూసి రష్మిక సమక్షంలో టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతానికి రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా ది గర్ల్ ఫ్రెండ్ నుంచి పోస్టర్ మాత్రమే రాబోతుంది. ఆ పోస్టర్ లో టీజర్ కి సంబంధించిన ఏమైనా అప్‌డేట్ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరో వైపు రష్మిక నటిస్తున్న ఇతర సినిమాల అప్డేట్స్ హడావుడి కనిపించడం లేదు.
నేషనల్ క్రష్ రష్మిక పుష్ప 2 మరియు యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఇలాంటి సమయంలో ఆమె పుట్టిన రోజు ను ఇంత చప్పగా, సింపుల్ గా నిర్వహించుకోవడం ఏమాత్రం బాగాలేదు అంటూ కొందరు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారి కోపంలో అర్థం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.