Begin typing your search above and press return to search.

నేషనల్ క్రష్ డ్యాన్స్ చూశారా.. క్రేజీక్రేజీగా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తన అభిమానులతో సోషల్ మీడియాలో ఎప్పుడూ సరదాగా ఉండేందుకు ఇష్టపడుతుంది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 11:10 AM GMT
నేషనల్ క్రష్ డ్యాన్స్ చూశారా.. క్రేజీక్రేజీగా..
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తన అభిమానులతో సోషల్ మీడియాలో ఎప్పుడూ సరదాగా ఉండేందుకు ఇష్టపడుతుంది. పాన్-ఇండియా స్టార్ గా ఎదిగినా కూడా ఆమె తరచుగా ఫన్నీ పోస్ట్ లతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా పుష్ప ఫేం రష్మిక తన ఇన్స్టాగ్రామ్ లో ఒక సరదా వీడియోను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఆ వీడియోలో రష్మిక యానిమాల్ సినిమాలోని మోస్ట్ ట్రెండింగ్ 'జమాల్ కుడు' అనే పాటకు డ్యాన్స్ చేస్తూ, తలపై కొబ్బరికాయను బ్యాలెన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఈ ఫన్నీ వీడియోను షేర్ చేస్తూ రష్మిక “నిద్ర లేని రాత్రి తర్వాత నా ఆటుపోట్లను బ్యాలెన్స్ చేసుకునే మార్గాలు” అంటూ సరదా ఎమోజీలను జత చేసింది. అలాగే, "తమకసరదాగా ఉండేందుకు విభిన్న సవాళ్ళను ముందుకు తెచ్చుకోండి" అంటూ స్మైలీ ఎమోజీతో క్యాప్షన్ జత చేసింది.

రష్మిక అభిమానులు ఆమె ప్రత్యేక ప్రతిభను మెచ్చుకుంటూ, కామెంట్స్ లో ప్రేమను వెల్లబోసారు. ఒక అభిమాని వావ్ అని కామెంట్ చేయగా, మరొకరు ఆమె సింప్లిసిటీ ని గుర్తు చేస్తూ, "ఈగో లేని నటి" అని లవ్లీ కామెంట్ అందించాడు. కొందరు ఆమెను "క్రష్మిక" అని ప్రేమగా పిలిస్తే, మరికొందరు "నేషనల్ క్రష్ కు ఇలాంటివి చేయడం చాలా సులభం" అంటూ ప్రశంసించారు.

రష్మిక సినిమా కెరీర్ విషయానికి వస్తే.. గత కొంతకాలంగా ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ రిజల్ట్ ను అందుకుంటున్నాయి. రాబోయే ప్రాజెక్టులలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘పుష్ప 2’, మరియు ‘సికందర్’ సినిమాలు ఉన్నాయి. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనేది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు రొమాంటిక్ డ్రామా, ఇందులో రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా, క్రిష్ణన్ వాసంత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అలాగే ‘పుష్ప 2’ లో రష్మిక మరోసారి అల్లు అర్జున్ తో జోడీ కడుతుంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పుష్ప 1’ కు వచ్చిన విజయంతో ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక ఇందులో ‘శ్రీవల్లి’ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ‘సికందర్’ లో రష్మిక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమా రీసెంట్ గా అనౌన్స్ చేయబడింది. పలు భాషలలో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటున్న రష్మిక, అభిమానుల హృదయాలలో తన ప్రత్యేక స్థానం పొందుతుంది.