పచ్చ కోకలో రష్మిక రంజితమే.. వాటే క్యూట్ మూవ్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 26 July 2024 8:07 AMనేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటూ తన సత్తా ఏంటో చాటుతోంది. వచ్చిన ప్రతి ఛాన్స్ ను దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ గా రానిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో పర్వాలేదనిపించిన అమ్మడు.. మెల్లమెల్లగా తన టాలెంట్ ను బయటపెట్టి ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో నటించి నేషనల్ క్రష్ గా మారిపోయింది.
ఆ సినిమాలో శ్రీవల్లిగా నటించి అందరినీ ఫిదా చేసేసింది రష్మిక. పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఇటీవల యానిమల్ మూవీలో స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన నటించి అదరగొట్టింది. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది అమ్మడు. వరుస షూటింగ్స్ లో పాల్గొంటోంది. తన బిజీ షెడ్యూల్ మధ్య కేరళలో రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లింది రష్మిక మందన్న.
స్లీవ్ లెస్ బ్లౌజ్, గ్రీన్ శారీలో ఈవెంట్ కు హాజరైన రష్మిక.. అక్కడి ఫ్యాన్స్ కోరిక మేరకు స్టెప్పులు వేసి సందడి చేసింది. తాను నటించిన వారసుడు మూవీలోని రంజితమే సాంగ్ కు డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి. వ్వావ్.. క్యూట్ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నేషనల్ క్రష్ అదుర్స్ అంటున్నారు. శారీలో పాప సూపర్ అని చెబుతున్నారు.
అయితే వారసుడు మూవీలో రష్మికతో పాటు దళపతి విజయ్ మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. రంజితమే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకుంది. కొన్ని రోజుల పాటు ఎక్కడ చూసినా అదే పాట వినిపించింది. ఇప్పుడు రష్మిక.. రంజితమే.. రంజితమే అంటూ సందడి చేసి అందరినీ అలరించింది.
ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సీక్వెల్ లో శ్రీవల్లి 2.0గా యాక్ట్ చేస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో కూడా నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ కుబేరలో సందడి చేయనుంది. బాలీవుడ్ లో చావా, సికందర్ చిత్రాల్లో లీడ్ రోల్ లో కనిపించనుంది. మరి వరుస సినిమాలతో అమ్మడు ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.