ఆ పనిచేయాలంటే రష్మికకి సిగ్గేస్తోందిట!
అందులోనూ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత అమ్మడు మరింత ఎనర్జిటిక్ గా పనిచేస్తుంది. ఫిట్ నెస్ ప్రీక్ గా ఏ రేంజ్ లో వెలిగిపోతుందో తెలిసిందే.
By: Tupaki Desk | 12 July 2024 5:41 AM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్నా అల్లరి పిల్ల అని ప్రత్యేకంగా చెప్పాలా? అమ్మడిలో ఆ రకమైన యాటిట్యూడ్ తో మరింత మంది అభిమానుల్ని సంపాదించుకుంది. నెటి జనులతో క్లోజ్ గా ఇంటరాక్ట్ అవ్వడం.. మీడియా సమావేశంలో జోకులేయడం..రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో అలరించడం వంటివి రష్మికకే చెల్లాయి. ట్యాలెంట్ తో పాటు అమ్మడిలో ఈ రకమైన క్వాలిటీ కూడా క్రేజ్ కి ఓ కారణంగా చెప్పొచ్చు.
అందులోనూ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత అమ్మడు మరింత ఎనర్జిటిక్ గా పనిచేస్తుంది. ఫిట్ నెస్ ప్రీక్ గా ఏ రేంజ్ లో వెలిగిపోతుందో తెలిసిందే. బాలీవుడ్ భామలకే పోటీగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక మరో ఇంట్రెస్టింగ్ సెల్పీ పోస్ట్ చేసింది. అందులో అమ్మడు చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని నవ్వుతూ సెల్పీ దిగింది. రష్మికలో బ్యూటీని పక్కనబెడితే ఈ ఫోటోని ఉద్దేశించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.
`హాయ్ మైలవ్స్` అంటూ నెటి జనుల్ని ఉద్దేశించి ఇలా రాసుకొచ్చింది. `ఇలా ఎందుకంటున్నానంటే? నాకు నేనుగా నా సెల్పీని పోస్ట్ చేయడానికి ఎందుకనో షై ఫీలింగ్ కలుగుతోంది. అది సరే గానీ నా గ్యాలరీలో నన్ను మిలియన్ల మంది ఇష్టపడుతున్నారు. కానీ మీ అందరిని అలరించేలా ఎక్కువ ఫోటోలు, పోస్ట్ లు చేయలేకపోతున్నాను. కానీ ఈ ఒక్కటీ మీకోసం అంటూ రష్మిక ఏకంగా కుర్రాళ్లందరికీ ఓ హగ్ నే విసిరింది.
అలాంటి ఎమోజీని పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకుంది. మరిన్ని సెల్పీలు పోస్ట్ చేయడం వల్ల మరింత సౌకర్యంగానూ నాకు ఉంటుంది` అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. రష్మిక అభిమానులు క్యూటీ , నాటీ, మైలవ్, లుక్స్ బ్యూటీఫుల్ అంటూ పొగిడేస్తున్నారు. హగ్ ఇవ్వడం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ ఉంది. ఇది కేవలం ఆన్ లైన్ లోనే? ఆఫ్ లైన్ లో అలాంటి హగ్ మాకు లేదా? అన్నట్లో ఒకరు రాసుకొచ్చారు.