Begin typing your search above and press return to search.

కొత్త ప్ర‌దేశాల్లో ర‌ష్మిక అనామ‌కురాలు!

కొత్త‌గా ఏ ప్ర‌దేశానికి వెళ్లినా అనామ‌కురాలిగా గ‌డుపుతుంది. అక్క‌డ త‌న‌కెవ‌రు తెలియ‌దు కాబ‌ట్టి సాధార‌ణ జీవితం...న‌లుగురికిత క‌లిసి ఉండ‌టాన్ని ఎంతో ఇష్ట‌ప‌డుతుందిట‌.

By:  Tupaki Desk   |   7 Nov 2023 6:42 AM GMT
కొత్త ప్ర‌దేశాల్లో ర‌ష్మిక అనామ‌కురాలు!
X

వెకేష‌న్ ని ఒక్కొక్క‌రు ఒక్కోలా ఆస్వాదిస్తుంటారు. స‌మంత ప్రెండ్స్ గ్యాంగ్ తో వెళ్తే త‌ప్ప‌కుండా సైక్లింగ్ చేస్తుంది. ఇంకా మ‌న‌సు చెప్పిన ఎన్నో ప‌నులు ఎవ‌రి అనుమ‌తి లేకుండానే చేసేస్తుంది. అథ్యాత్మిక ప్రేదేశాలు చుట్టేస్తుంది. ఇక శ్రుతిహాస‌న్ బిజీ..ప‌ని ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం కోసం ఒంట‌రిగానే విదేశాల‌కు వె ళ్లిపోతుంది. రొటీన్ నుంచి బ్రేక్ తీసుకుని కొత్త ప్ర‌దేశంలో వాలిపోతుంది. అలా చేయ‌డం వ‌ల్ల శారీర‌కంగా..మాన‌సికంగా ఉన్న అల‌స‌ట దూర‌మై మ‌రింత ఉత్సాహంగా ప‌నిచేయ‌గ‌ల్గుతుంది.

ఒంట‌రి త‌నం ఎన్నో అనుభ‌వాలు ప‌రిచ‌యం చేస్తుంద‌ని అంటుంది. అందుకే తాను ఏ దేశం వెళ్లాల‌ను కున్నా సింగిల్ టికెట్ బుక్ చేసుకుని ప్లైట్ ఎక్కేస్తుంది. మ‌రి నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ వెకేష‌న్ని ఎలా ఆస్వాదిస్తుందో తెలుసా? ఇప్పుడు ఎంతో స్వేచ్ఛ‌గా అన్ని దేశాలు చుట్టేస్తాను అంటోంది. ఒక‌ప్పుడు త‌ల్లిదండ్రులు బ‌య‌ట‌కు పంపిచాలి అంటే భ‌య‌ప‌డేవారుట‌. అందులోనూ ఒంట‌రిగా అంటే అస్స‌లు ఒప్పుకునే వారు కాదుట‌.

ఇప్పుడా భ‌యం లేకుండా ప్ర‌పంచంలో న‌చ్చిన ప్ర‌దేశాలు తిరిగేస్తుందిట‌. షూటింగ్..ప‌ని ఒత్తిడి నుంచి విరామం తీసుకుని త‌న‌కోసం అంటూ కొంత స‌మ‌యాన్ని త‌ప్ప‌క కేటాయిస్తుందిట‌. ప్ర‌యాణాల్ని..కొత్త ప్ర‌దేశాల్ని మించిన ఆస్వాద‌న ఎక్క‌డా దొర‌క‌దని అంటుంది. కొత్త‌గా ఏ ప్ర‌దేశానికి వెళ్లినా అనామ‌కురాలిగా గ‌డుపుతుంది. అక్క‌డ త‌న‌కెవ‌రు తెలియ‌దు కాబ‌ట్టి సాధార‌ణ జీవితం...న‌లుగురికిత క‌లిసి ఉండ‌టాన్ని ఎంతో ఇష్ట‌ప‌డుతుందిట‌.

ఇంకా బోర్ కొడితే! మ‌నుషులు ఎవ‌రు లేని ప్రదేశాల‌కు వెళ్లిపోతుందిట‌. న‌చ్చిన ప్ర‌దేశాలు సోంతూరు కూర్గ్ అయితే ఆ త‌ర్వాత హైద‌రాబాద్..ప్యారిస్ లు అంటే ఎక్కువ ఇష్ట‌మ‌ట‌. వీట‌న్నింటి త‌ర్వాత ఏ దేశానికైనా వెకేష‌న్ కి వెళ్ల‌డం ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుందిట‌. మొత్తానికి ర‌ష్మిక అభిరుచులు కూడా బాగున్నాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిక పుష్ప‌-2 లోన‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండ‌వ భాగంలో పుష్ప‌రాజు భార్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ రెండు పాత్ర‌ల్ని సుకుమార్ తెర‌పై ఎంత రొమాంటిక్ గా మ‌లుస్తున్నాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగానే ఉంది. తొలి భాగం స‌క్సెస్ లో ఆ రొమాన్స్ కూడా స‌క్సెస్ లో కీల‌క‌భాగమే.