రష్మిక మందన్న పాత అందం.. ఇంకాస్త ఘాటుగా..
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది
By: Tupaki Desk | 18 Oct 2023 4:19 AM GMTసౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా హిందీలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తో కిస్సింగ్ సన్నివేశాలలో రష్మిక నటించింది. ఈ మూవీపై అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది.
మరో వైపు పుష్ప 2 మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉంది. అలాగే రెయిన్ బో అనే చిత్రంలో కూడా రష్మిక నటిస్తోంది. ఇలా ఆమె ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. హిందీలో రీసెంట్ గా విక్కీ కౌశల్ కి జోడీగా ఒక పాన్ ఇండియా మూవీలో నటించడానికి రష్మిక మందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే.
ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. వారిని ఎంటర్టైన్ చేయడానికి రెగ్యులర్ గా రష్మిక గ్లామర్ ఫోటోలని పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రష్మిక టీం ఆమె ఓల్డ్ చిత్రాలలో ఒకదానిని మళ్ళీ షేర్ చేశారు. ఓ యాడ్ ఫోటోషూట్ కోసం బ్లాక్ కలర్ స్కర్ట్ తో వెట్ అందాలతో ఉన్న రష్మిక హాట్ లుక్స్ కి సంబందించిన పిక్ షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.
ఈ ఫోటోని 1.2 మిలియన్స్ మంది లైక్ చేయడం విశేషం. ఈ పిక్ లో రష్మిక హాట్ లుక్స్ తో కుర్రాళ్ళ హీట్ పెంచేస్తోందని చెప్పాలి. ఈ ఫోటోని మేము షేర్ చేస్తున్నామనే విషయం రష్మికకి తెలియదు. కాని మీ అందరి కోసం కాస్తా స్వేచ్చని తీసుకొని ఈ పిక్ పంచుకుంటున్నాము. ఏడాది క్రితం ఈ ఫోటో తీయడం జరిగింది. అని రష్మిక టీం ఆమె హ్యాండిల్ లోనే పోస్ట్ పెట్టారు.
అయితే ఈ హాట్ ఫోటోని రష్మికకి తెలియకుండా ఆమె టీం పోస్ట్ చేసారంటే నమ్మడం కష్టం అనే మాట వినిపిస్తోంది. నెటిజన్లు, రష్మిక ఫాలోవర్స్ అయితే ఈ బ్లాక్ డ్రెస్ తో హాట్ వెట్ ఫోటోని పూర్తిగా ఆశ్వాదిస్తున్నారని చెప్పాలి.