'యానిమల్' లో రష్మిక... ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో హిందీలో రూపొందిన యానిమల్ సినిమా విడుదలకు సిద్ధం అయింది
By: Tupaki Desk | 17 Nov 2023 2:30 PM GMTతెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో హిందీలో రూపొందిన యానిమల్ సినిమా విడుదలకు సిద్ధం అయింది. రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో మీడియా వర్గాల వారితో పాటు అంతా కూడా ఉన్నారు.
యానిమల్ సినిమా లో రణబీర్ కపూర్ పాత్ర తో పాటు ప్రతి ఒక్క పాత్ర కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ రష్మిక మందన్న పాత్ర ఇంకా ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అన్నట్లుగా నిలవబోతోంది అంటున్నారు. పలు ఎమోషనల్ సన్నివేశాల్లో రష్మిక నటించిందట.
ముఖ్యంగా రణబీర్ కపూర్ ప్రవర్తన వల్ల ఆయన భార్య అయిన రష్మిక మందన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుందట. ఆ సన్నివేశాల్లో రష్మిక జీవించినట్లు ఉంటుందని తెలుస్తోంది. రష్మిక తన అందాల ఆరబోతతో ఇప్పటి వరకు కెరీర్ ను నెట్టుకు వస్తుంది అంటూ ట్రోల్స్ చేసే వారికి ఈ సినిమాలోని తన నటనతో సమాధానం ఇవ్వబోతుందట.
మరో వైపు రష్మిక మందన్న తెలుగు లో పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తోంది. మొదటి పార్ట్ లో పెద్దగా నటించేందుకు స్కోప్ దక్కలేదు. పాటలు, స్కిన్ షో తో మెప్పించింది. ఇక సెకండ్ పార్ట్ లో పుష్ప భార్య పాత్ర లో రష్మిక నటనకు ఆస్కారం ఉంటుందట. కనుక యానిమల్ మరియు పుష్ప 2 లతో రష్మిక కుమ్మేయడం ఖాయం అనిపిస్తోంది.