ఆ ప్రేమకు, ఫ్రేమ్ కు రష్మిక ఎమోషనల్
గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటున్న రష్మిక మందన గోల్డెన్ టైమ్ ఇప్పుడు గట్టిగానే నడుస్తుంది
By: Tupaki Desk | 28 Nov 2023 11:46 AM GMTగ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటున్న రష్మిక మందన గోల్డెన్ టైమ్ ఇప్పుడు గట్టిగానే నడుస్తుంది. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం సక్సెస్ అవుతోంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆమె నుంచి మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిలో ఏ ఒక్కటి సక్సెస్ అయినా కూడా అమ్మడి హోదా మాత్రం మరో ఐదేళ్లపాటు అలా కొనసాగుతూ ఉంటుంది అని చెప్పవచ్చు.
ఇక డిసెంబర్ 1వ తేదీన రాబోతున్న యానిమల్ సినిమాపై కూడా అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో కూడా రష్మిక మంచి సక్సెస్ అయితే అందుకునే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇక అందులో కూడా రష్మిక మందాన చాలా అందంగా కనిపించింది. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఒక ఫ్రేమ్లో మాట్లాడుతూ ఉండగా వెనకాల మహేష్ బాబు ఒకవైపు రణబీర్ మరొకవైపు ఉన్నట్లుగా అక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది. ఆ ఫ్రేమ్ కు రష్మిక ఎంతో ఆనంద పడింది. అంతే కాకుండా మరొక ఫోటోలో అయితే మహేష్ బాబు ఆమెను ప్రేమతో దగ్గరికి తీసుకున్నట్లు ఉంది.
ఇక అందులో కూడా రష్మిక చాలా అందంగా కనిపించింది. ఆ ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ ఫోటోలు తీసిన వారికి కూడా రష్మిక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. మధురమైన క్షణాలను ఈ విధంగా చూపించినందుకు చాలా థాంక్స్ అని తెలియజేసింది.
నిన్న ఈవెంట్లో ప్రేమతో పాటు ఎంతో గౌరవం అలాగే ఊహించని మ్యాడ్ కొంచెం భయం అలాగే సినిమా కోసం ఎదురుచూపులు ఇవన్నీ కూడా కనిపించాయి. అయితే ఆ క్షణం ఎంతో మ్యాజిక్ గా అనిపించింది. అంతులేని ఆ ప్రేమకు ఎంత కృతజ్ఞతలు చెప్పిన కూడా తక్కువే. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. యానిమాల్ సినిమా మరో మూడు రోజుల్లో సందడి స్టార్ట్ చేయబోతోంది. ఇక అందరూ ఎంజాయ్ చేయాలి అని రష్మిక సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది.