రష్మిక ఇన్ స్టా పోస్ట్ వైరల్.. అతన్ని ఉద్దేశించి చేసిందా?
దీనికంటే ముందు రష్మికకి 'పుష్ప ది రైజ్' ద్వారా ఫస్ట్ పాన్ ఇండియా సక్సెస్ దక్కింది
By: Tupaki Desk | 19 Dec 2023 3:06 PM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం సక్సెస్ మూడ్ లో ఉంది. ఈ హీరోయిన్ నటించిన 'యానిమల్' మూవీ పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కావడంతో ఆ సక్సెస్ ని తెగ ఎంజాయ్ చేస్తోంది. గత కొంతకాలంగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న రష్మికకి యానిమల్ పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ మూవీతో బాలీవుడ్ లో మొదటి సక్సెస్ ని, పాన్ ఇండియా లెవెల్ లో రెండవ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది.
దీనికంటే ముందు రష్మికకి 'పుష్ప ది రైజ్' ద్వారా ఫస్ట్ పాన్ ఇండియా సక్సెస్ దక్కింది. ఇక యానిమల్ తో మరోసారి రష్మిక కు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ దక్కడంతో అదే జోష్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'గర్ల్ ఫ్రెండ్' అనే మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో పాటు 'పుష్ప' సీక్వెల్లో నటిస్తోంది రష్మిక. రీసెంట్ గానే 'పుష్ప 2' షూటింగ్లో జాయిన్ అయినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రష్మిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. తన గ్లామరస్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ సినిమా అప్డేట్స్ ని కూడా షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా రష్మిక మందన పోస్ట్ చేసిన ఇన్ స్టా స్టోరీ నెట్టింట తెగ వైరల్ గా మారింది." నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. నా జీవితంలో వచ్చినందుకు చాలా థాంక్స్" అని ఆమె ఓ కొటేషన్ ను పోస్ట్ చేయడంతో రష్మిక ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసిందని నెటిజన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే చాలామంది రష్మిక ఫ్యాన్స్ 'ఇది కచ్చితంగా విజయ్ దేవరకొండ కోసం చేసిన సీక్రెట్ పోస్ట్ అని అంటుంటే', 'వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే.. రష్మిక ఆ పోస్ట్ మరెవరిని ఉద్దేశించి చేసిందో' అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే చాలామంది మాత్రం ఇది 100% విజయ్ దేవరకొండ ను ఉద్దేశించే అని చెప్పడం గమనార్హం. ఎందుకంటే ఎంతో కాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ నడుస్తోందని, వాళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు తెరపైకి వచ్చాయి.
కానీ ఈ వార్తలపై అటు విజయ్ దేవరకొండ గానీ ఇటు రష్మిక మందన కానీ డైరెక్ట్ గా స్పందించింది లేదు. దానికి తోడు ఏదైనా పండగ వచ్చిందంటే చాలు రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లో వాలిపోతుంది. విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా రష్మిక అంటే చాలా ఇష్టం. దాంతో ఫ్యాన్స్ కూడా వీళ్ళు లవర్స్ అని ఫిక్స్ అయిపోయారు. మరి రష్మిక నిజంగానే ఈ పోస్ట్ విజయ్ ఉద్దేశించి చేసిందా? లేదా అనేది తెలియాలంటే స్వయంగా ఆమెనే దీనిపై క్లారిటీ ఇవ్వాలి.