పుష్ప 2 : నా బాధ్యత చాలా పెరిగింది
పుష్ప 2 పై తాజాగా శ్రీవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ... పుష్ప 2 షూటింగ్ కి వెళ్లిన సమయంలో నా సొంతం ఫ్యామిలీకి తిరిగి వెళ్లినట్లు అనిపించింది.
By: Tupaki Desk | 2 March 2024 12:44 PM GMTఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప వచ్చి చాలా కాలం అవుతున్న కూడా ఆ సినిమా పాటలు మరియు సన్నివేశాలు సోషల్ మీడియా ను ఇంకా షేక్ చేస్తూనే ఉన్నాయి. సినిమాలోని బన్నీ పాత్ర తో పాటు రష్మకి మందన్న పోషించిన శ్రీవల్లి పాత్ర కూడా చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు.
పుష్ప సినిమా చివర్లో హీరో, హీరోయిన్ పెళ్లి అయినట్లుగా చూపించారు. కనుక పుష్ప 2 లో బన్నీ కి రష్మిక భార్య గా కనిపించబోతుంది. పుష్ప రాజ్ మరియు శ్రీవల్లి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది.. పుష్ప తన బిజినెస్ ను ఎలాంటి ఎత్తులకు తీసుకు వెళ్లాడు, అక్కడ ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది పుష్ప 2 లో చూపించే అవకాశాలు ఉన్నాయి.
పుష్ప 2 పై తాజాగా శ్రీవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ... పుష్ప 2 షూటింగ్ కి వెళ్లిన సమయంలో నా సొంతం ఫ్యామిలీకి తిరిగి వెళ్లినట్లు అనిపించింది. ఈ సినిమాలో పుష్ప రాజ్ భార్య పాత్రలో కనిపించబోతున్నాను. పెళ్లి తర్వాత సహజంగానే బాధ్యతలు పెరుగుతాయి. అలాగే పుష్ప 2 లో కూడా నా పాత్రకు చాలా బాధ్యత ఉంటుంది.
యానిమల్ సినిమాలో హీరో కు భార్య పాత్ర లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న కచ్చితంగా పుష్ప 2 లో కూడా మంచి నటనతో పుష్ప రాజ్ యొక్క భార్య గా కనిపించడం ఖాయం అన్నట్లుగా ఆమె ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
పుష్ప 2 సినిమా షూటింగ్ పాటలు మినహా దాదాపుగా రష్మిక మందన్న పూర్తి చేసిందనే వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ప్రతి సన్నివేశాన్ని, ప్రతి షాట్ ను కూడా ఎంతో జాగ్రత్తగా తీస్తున్నాడని పలువురు యూనిట్ సభ్యులు అన్నారు. రష్మిక మందన్న కూడా సుకుమార్ వర్కింగ్ స్టైల్ పై సూపర్ అంటూ కామెంట్స్ చేసింది.