రష్మిక ఈసారి ఇంత పెద్ద క్లాస్ తీసుకుందేంటి?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్..బాలీవుడ్ లో అమ్మడు ఎవరూ లేనంత బిజీగా ఉంది
By: Tupaki Desk | 8 April 2024 6:51 AM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్..బాలీవుడ్ లో అమ్మడు ఎవరూ లేనంత బిజీగా ఉంది. పాన్ ఇండియా అవకాశాలు అందుకుంటూ అంతకంతకు తన రేంజ్ ని రెట్టింపు చేసుకుంటుంది. ఓచిన్న సినిమాతో పరిచయమైన అమ్మడు ఈ స్థాయికి చేరుతుందని తాను కూడా ఊహించి ఉండదు. ఆ విషయంలో నేషనల్ క్రష్ ఎంతో లక్కీ గాళ్ అన చెప్పాలి. ఇటీవలే అమ్మడు పుట్టిన రోజుని సైతంవిదేశాల్లో స్నేహితులతో ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
ఇలా స్నేహితులతో సెలబ్రేషన్ అన్నది సక్సెస్ అయిన తర్వాత ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అమ్మడు ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా పెట్టింది. జీవితంలో తన అనుభవాలు...సాధించిన లక్ష్యాలు... సమాజంలో ఉన్నత గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. కాస్త వేదాంత దోరణిలోకి వెళ్లిన్లు కనిపిస్తుంది. `ప్రతీరోజు అదే నీ చివరి రోజు అని జీవించాలి. ఈ మాట బోర్ కొట్టినా డైని అలాగే అనుకోవాలి. ప్రతీ రోజు మన ఖర్చులు- బిల్లులు చెల్లింపుకు మనం సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టాలి.
ఇండస్ట్రీలో.. సమాజంలో గౌరవాన్ని సంపాదించుకోవాలి. కలలు- లక్ష్యాలను చేరుకోవాలి. అందుకోసం కష్టపడి పనిచేయాలి. ఏ పని అనుకున్నా అంతకంటే ముందే ఆ పని అయిపోయేలా చూసుకోవాలి. చదవడంలోనూ అంతే చురుకుగా ఉండాలి. క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించాలనే తాపత్రయం ఉండాలి. డబ్బు బాగా సంపాదించాలి. సంపదతోనే జీవితం ముడిపడి ఉంది. మంచి కారు..ఇల్లు సమకూర్చుకోవాలి. బెస్ట్ కాలేజీలో సీటు పంపాదించాలి. చదువు కోవడానికి స్కాలర్ షిప్ అందుకోవాలి. ఇలాంటి కోరికలతో అందరి జీవితాలు సాగుతాయి.
కానీ ఈ పోరాటంలో మనకు జీవితంలో ఏది ముఖ్యమనే విషయం మరిచిపోతాం. ఇలా ఉండటం వల్ల మన సంతోషాన్ని కోల్పోతామని ఎంత మందికి తెలుసు. కంటికి కనిపించని దేన్నో టార్గెట్ చేయడంతోనే ఈ సమస్య మొదలవుతుంది. కాబట్టి జీవితంలో బ్యాలెన్స్ గా ఉండటం..ముందుకెళ్లడం అతిముఖ్యమైనదిగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎప్పుడు ఎలాంటి క్లాస్ లు తీసుకొని రష్మిక ఈసారి ఇంత పెద్ద క్లాస్ తీసుకుంటేందని అంతా ఆశ్చర్యపోవడం అభిమానుల వంత్తైంది.