Begin typing your search above and press return to search.

ఎక్కడ చూసినా శ్రీవల్లి సందడే..!

మొత్తానికి చేతిలో అర డజను సినిమాలతో రష్మిక ఇండస్ట్రీలోనే అత్యంత బిజీ హీరోయిన్ గా ఉంది అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   25 Jun 2024 7:46 AM GMT
ఎక్కడ చూసినా శ్రీవల్లి సందడే..!
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప, యానిమల్‌ సినిమాల తర్వాత పాన్ ఇండియా స్థాయిలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను చేస్తున్న రష్మిక మందన్న పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాలు కాకుండా మరో మూడు నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మరో రెండు మూడు సినిమాలకు కూడా ఈమె సైన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చేతిలో అర డజను సినిమాలతో రష్మిక ఇండస్ట్రీలోనే అత్యంత బిజీ హీరోయిన్ గా ఉంది అనడంలో సందేహం లేదు.

ధనుష్ తో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న కుబేర సినిమాతో పాటు పుష్ప మరియు గాళ్ ఫ్రెండ్‌ సినిమాలు ఈ ఏడాది లో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో హిందీ సినిమా సికిందర్‌, రెయిన్ బో మరియు ఎన్టీఆర్‌ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ లో నటించబోతుంది.

విక్కీ కౌశల్ తో కలిసి చావా అనే సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తుంది. యానిమల్‌ సీక్వెల్‌ అయిన యానిమల్‌ పార్క్ లో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటించబోతోంది. అంతకు ముందు యానిమల్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ రూపొందించబోతున్న ప్రభాస్‌ స్పిరిట్‌ లో కూడా రష్మిక మందన్న నటించబోతుందట.

ఇలా రష్మిక బాలీవుడ్‌, కోలీవుడ్‌ టాలీవుడ్‌ లో బిజీ బిజీగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా రష్మిక పేరు వినిపిస్తుంది, సోషల్‌ మీడియాలో ఎక్కడ విన్నా కూడా రష్మిక నామ స్మరణ జరుగుతుంది. ఇంతటి క్రేజ్ కేవలం రష్మిక మందన్నకే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.