Begin typing your search above and press return to search.

హార్ట్ మెల్ట్ అయ్యేలా ఈ లుక్కేంటి శ్రీవల్లి

ఇక అందులో ఫిట్నెస్ తోనే షాక్ ఇచ్చింది. ఇక కొంటెగా నవ్వుతూ హార్ట్ మెల్ట్ అయ్యేలా చేసిందని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 4:54 PM GMT
హార్ట్ మెల్ట్ అయ్యేలా ఈ లుక్కేంటి శ్రీవల్లి
X

రష్మిక మందన్న గ్లామర్ తోనే కాకుండా నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ, బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రష్మిక జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తక్కువ బడ్జెట్ సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు, కంటెంట్ ఉన్న కథలు ఎంచుకుంటూ తన నటనలో వైవిధ్యాన్ని చూపిస్తోంది.

అన్ని వర్గాల్లో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకోవడానికి రష్మిక చేస్తున్న ప్రయత్నాలు విశేషంగా ఉన్నాయి. సౌత్ ఇండియన్ సినిమాల్లో మాత్రమే కాకుండా, బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొందరగానే అక్కడ కూడా పెద్ద విజయాలను చూసిన రష్మిక, ఇంకా పెద్ద ఎత్తున సక్సెస్ అందుకోవడానికి సిద్ధమవుతోంది. అంతేకాదు, పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా పాల్గొంటూ తన పేరు, ప్రఖ్యాతిని పెంచుకుంటోంది.

సోషల్ మీడియాలో కూడా అమ్మడు తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది. రీసెంట్ గా శ్రీవల్లి వర్కౌట్ చేసిన తరువాత ఓ రెండు ఫొటోలు అలా వదిలింది. ఇక అందులో ఫిట్నెస్ తోనే షాక్ ఇచ్చింది. ఇక కొంటెగా నవ్వుతూ హార్ట్ మెల్ట్ అయ్యేలా చేసిందని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. రష్మిక ఈ ఫోటోలలో గ్లామర్ తో పాటు సింపుల్ గా క్యూట్ గా కనిపిస్తూ, అభిమానులను ఆకట్టుకుంది.

రష్మిక మునుముందు కూడా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని, ఆమె క్రేజ్ ఇంకా పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'పుష్ప: ది రూల్' సెకండ్ పార్ట్ లో రష్మిక నటిస్తుండటంతో ఆ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే, బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేస్తున్న రష్మిక, అక్కడ తన మార్క్ చూపించడానికి సిద్ధమవుతోంది. 2016లో 'కిరాక్ పార్టీ' సినిమాతో మొదలైన ఆమె సినీ ప్రయాణం, ప్రతీ ఏడాది కూడా మరింత పటిష్టంగా కొనసాగుతోంది.

గత ఏడాది 'వారిసు', 'మిషన్ మజ్ను', 'యానిమల్' వంటి సినిమాల్లో నటించి, మంచి విజయాలను అందుకుంది. 'యానిమల్' సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా, 'వారిసు' మంచి కమర్షియల్ సక్సెస్ ను అందించింది. రష్మిక, ప్రస్తుతం 'పుష్ప 2' తో పాటు, 'రెయిన్ బో' అనే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. అలాగే, 'ది గర్ల్ ఫ్రెండ్' అనే సినిమా కూడా సెట్స్ పై ఉంది. సినిమాలతో పాటు, సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.