Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం టాప్ బ్యూటీ

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా రష్మిక మందనని ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   23 Jun 2024 6:16 AM GMT
ఎన్టీఆర్ కోసం టాప్ బ్యూటీ
X

పాన్ ఇండియా హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన. పుష్ప మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ హిందీలో యానిమల్ మూవీ ద్వారా మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాలు రష్మిక ఇమేజ్ ని అమాంతం పెంచేశాయి. ఇండియన్ వైడ్ గా ఆమెకి యూత్ లో విపరీతమైన ఆదరణని తీసుకొచ్చాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప ది రూల్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్ ని ఈ బ్యూటీ సొంతం చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఆగష్టులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ లో ఉన్నారంట. మూవీకి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా రష్మిక మందనని ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ కి జోడీగా రష్మిక కన్ఫర్మ్ అయితే మాత్రం కాంబినేషన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఒక వేళ ఎన్టీఆర్ తో రష్మిక జతకడితే ఆమె చేయబోయే నాలుగో పాన్ ఇండియా సినిమా డ్రాగన్ అవుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కాబట్టి మినిమమ్ గ్యారెంటీ ఖాయం. దీంతో రష్మిక ఇమేజ్ కూడా మరింత టాప్ లోకి వెళ్ళిపోతుందనే మాట వినిపిస్తోంది.

ఇవి కాకుండా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రంలో కూడా రష్మిక నటిస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. దీంతో పాటు హిందీలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో చేస్తోన్న స్పై థ్రిల్లర్ వార్ 2లో తారక్ నటిస్తున్నాడు. ఆ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. హృతిక్ రోషన్ తో కలిసి తారక్ వార్ 2లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.