వైల్డ్ ఎనిమల్.. ఇలా ఊహించలేదు రష్మిక!
తాజాగా, ఈ మూవీలో హీరోయిన్ లుక్ రిలీజ్ చేశారు. ఆ లుక్ రష్మిక చక్కగా చీర కట్టుకొని, చాలా కూల్ గా కనపడుతోంది.
By: Tupaki Desk | 23 Sep 2023 7:43 AMబాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం యానిమల్. ఈ మూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కాగా, త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. దీనిలో భాగంగా స్లోగా మూవీని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడానికి మూవీ టీమ్ ప్రయత్నిస్తోంది.
దీనిలో భాగంగానే, మూవీలోని ప్రధాన పాత్రల పోస్టర్లను ఒక్కొక్కరిగా రలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రణబీర్ లుక్ రివీల్ చేశారు. రీసెంట్ గా సీనియర్ నటుడు అనిల్ కపూర్ లుక్ విడుదల చేశారు. తాజాగా, ఈ మూవీలో హీరోయిన్ లుక్ రిలీజ్ చేశారు. ఆ లుక్ రష్మిక చక్కగా చీర కట్టుకొని, చాలా కూల్ గా కనపడుతోంది. రణబీర్ లుక్ ని విడుదల చేసినప్పుడు చాలా భయంకరంగా ఉన్నాడు.
టైటిల్ కి తగినట్లుగానే రణబీర్ ని ఒంటినిండా రక్తంతో ఉన్నట్లు చూపించారు. అయితే, రష్మిక లుక్ ని చాలా పద్దతిగా, ప్రశాంతంగా ఉన్నట్లు చూపిచడం విశేషం. ఇక, ప్రపంచానికి అతను ఎంత వైల్డ్ అయినా, అతనికి మాత్రం ఆమే ప్రపంచం అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. రష్మిక రోల్ ఇలా ఉంటుందని ఊహించలేదు ఎవ్వరూ. ఇక, ఈ కాంబినేషన్ ని అర్జున్ రెడ్డితో కూడా కొందరు పోలుస్తున్నారు.
అర్జున్ రెడ్డి మూవీలోనూ హీరో చాలా కోపంగా ఉంటాడు. హీరోయిన్ మాత్రం చాలా కూల్ గా, ప్రశాంతంగా, పక్కింటి అమ్మాయిలా కనపడుతుంది. ఇప్పుడు దీనిలోనూ అదే ఫార్ములా డైరెక్టర్ ఫాలో అయ్యాడా అనే ఫీలింగ్ కలుగుతోంది. ఏది ఏమైనా రష్మిక లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక, ఆమె పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే, సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
ఈ మూవీ ట్రైలర్ ని ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు.ఇక, ఈ మూవీ డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ యానిమల్ సినిమా చాలా హింసాత్మకంగా సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో యానిమల్ సినిమా మోస్ట్ వైలెంట్ గా రానుంది.