Begin typing your search above and press return to search.

నేషనల్ క్రష్.. ఫ్లవర్ కంటే సుకుమారంగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా ఈ భామకు అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి

By:  Tupaki Desk   |   12 April 2024 8:50 AM GMT
నేషనల్ క్రష్.. ఫ్లవర్ కంటే సుకుమారంగా..
X

ప్రతి ఏడది మినిమమ్ సాలిడ్ సక్సెస్ అందుకుంటూ కెరీర్ గ్రోత్ పెంచుకుంటున్న రష్మిక మందన్న సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు హైలెట్ గా నిలుస్తూనే ఉంటుంది. అమ్మడు గత ఏడాది యానిమల్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక సినిమా తేడా కొట్టినా మళ్ళీ వెంటనే బౌన్స్ ప్యాక్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా ఈ భామకు అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా ఈ బ్యూటీకి ఫ్యాన్స్ ఉన్నారు అని ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ లైఫ్ స్టైల్ ఏషియా మ్యాగజైన్ ను ఇచ్చిన ఫోటోషూట్ లో చాలా సుకుమారంగా కనిపించింది. చిన్న గౌనులో అమ్మడు ఒక అందమైన ఫ్లవర్ తరహాలో స్టిల్ ఇచ్చింది అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

రష్మిక మందన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా వండర్స్ ను ఎక్స్ ప్లోర్ చేస్తోంది అంటూ ఆ మ్యాగజైన్లో ఒక అందమైన క్యాప్షన్ కూడా ఉంది. రష్మిక ఎలాంటి స్టిల్ ఇచ్చిన కూడా అందులో ఆకట్టుకునే హావభావం ఉంటుంది అని మరోసారి రుజువయింది. ఇక ఈ బ్యూటీ తన స్లీవ్ లెస్ అందాలతో కూడా అబ్బాయిలను మతిపోగోట్టేసింది అని చెప్పవచ్చు. ఇక రష్మిక మందన సినిమాల విషయానికి వస్తే అమ్మడు యానిమల్ సినిమా తర్వాత మరింత బిజీగా మారిపోయింది.

ఇప్పుడు ఆమెకు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా చాలా అవకాశాలు వస్తూ ఉన్నాయి. కానీ తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. గత ఏడాది విజయ్ తో వారిసు సినిమా కూడా చేయగా కమర్షియల్ గా సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే క్లిక్ అయింది. హిందీలో మిషన్ మజ్ను అనే సినిమా కూడా చేసింది.

ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆమె లిస్టులో రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ అనే మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. హిందీలో కూడా ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది. తప్పకుండా పుష్ప సెకండ్ పార్ట్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రష్మిక రేంజ్ మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.