ఫ్యాషన్ వీక్ శ్రీవల్లి అందాల మాయ
ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన మిలన్ ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేట్ చేసింది రష్మిక. టోటల్ లాంగ్ బ్లాక్ కలర్ డ్రెస్, షార్ట్ హెయిర్ కట్ తో ర్యాంప్ వాక్ చేసింది.
By: Tupaki Desk | 22 Feb 2024 6:51 AM GMTరష్మిక మందన్న.. తక్కువ కాలంలోనే మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్. నాగశౌర్య ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలందరితో ఆడిపాడింది. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో ఏకంగా నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇటీవల యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది.
ప్రస్తుతం నార్త్ టు సౌత్.. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. తన యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో నేషనల్ లెవెల్ లో ఫ్యాన్స్ సంపాదించుకుంది. రోజురోజుకూ ఫాలోయింగ్ ను ఓ రేంజ్ లో పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. పర్సనల్ తోపాటు సినీ అప్డేట్స్ షేర్ చేస్తుంటోంది. కొత్త కొత్త ఫొటోషూట్స్ పోస్ట్ చేసి సందడి చేస్తుంటోంది. తాజాగా కొత్త ఫొటోలను షేర్ చేసింది.
ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన మిలన్ ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేట్ చేసింది రష్మిక. టోటల్ లాంగ్ బ్లాక్ కలర్ డ్రెస్, షార్ట్ హెయిర్ కట్ తో ర్యాంప్ వాక్ చేసింది. అంతే కాకుండా జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుకా టైగర్ ను ప్రమోట్ చేసింది. డీసెంట్ ఔట్ ఫిట్, మంచి చిరునవ్వుతో అక్కడ ఉన్న వారందరినీ ఆకర్షించింది. గ్లోబల్ స్టైల్ ఐకాన్ గా తన ర్యాంప్ వ్యాక్ తో అట్రాక్ట్ చేసింది.
అందుకు సంబంధించిన ఫొటోలను రష్మిక తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె షేర్ చేసిన పిక్స్.. కొద్ది క్షణాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చాయి. షార్ట్ హెయిర్ తో క్యూట్ గా రష్మిక అదరగొట్టేసిందని నెటిజన్లు అంటున్నారు. స్టైల్ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. స్టైలిష్ లుక్స్ కు కేరాఫ్ అడ్రెస్ రష్మిక అంటూ కొనియాడుతున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లో బిజీగా గడుపుతోంది రష్మిక. తనకు నేషనల్ క్రష్ గా పేరు తెచ్చిన పుష్ప మూవీ సీక్వెల్ లో నటిస్తోంది. మరోసారి శ్రీవల్లిగా అలరించనుంది. హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం..ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బోలో నటిస్తోంది. హిందీ మూవీ చావాలో కూడా యాక్ట్ చేస్తోంది.