Begin typing your search above and press return to search.

నీల్ - తారక్.. ఆ బ్యూటీపై ఫోకస్?

మూవీలో తారక్ కి జోడీగా స్టార్ హీరోయిన్ రష్మిక మందనని తీసుకోవాలని అనుకుంటున్నారంట. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.

By:  Tupaki Desk   |   25 May 2024 4:12 AM GMT
నీల్ - తారక్.. ఆ బ్యూటీపై ఫోకస్?
X

గ్లోబల్ స్టార్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న దేవర మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతోంది. ఇంకా ఫైనల్ షెడ్యూల్ మిగిలి ఉందని సమాచారం. మరో వైపు బాలీవుడ్ లోకి తారక్ వార్ 2 ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

బాలీవుడ్ ప్రిన్స్ హృతిక్ రోషన్ తో ఈ చిత్రం లో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా వార్ 2 పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకి డ్రాగన్ అనే పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

ఆగష్టు నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తారక్ బర్త్ రోజు పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్, సలార్ కి మించిన కథతో డ్రాగన్ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నారంట. కచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్ లో బెస్ట్ మూవీని ప్రశాంత్ నీల్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ప్రశాంత్ నీల్ అండ్ కో ఉన్నారంట. మూవీలో తారక్ కి జోడీగా స్టార్ హీరోయిన్ రష్మిక మందనని తీసుకోవాలని అనుకుంటున్నారంట. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. తారక్ కి జోడీగా రష్మిక మందన అయితే పెయిర్ బెస్ట్ గా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

రష్మిక మందన చేసిన పుష్ప ది రూల్ మూవీతో రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ సికందర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోందంట. ఫీమేల్ సెంట్రిక్ మూవీ కూడా రష్మిక చేస్తోంది. వీటితో పాటు కొన్ని హిందీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయంట. యానిమల్ తర్వాత రష్మిక మందన ఇమేజ్ మరింత పెరిగిపోయింది. దీంతో అన్ని భాషలలో పాన్ ఇండియా మూవీస్ కోసం రష్మిక మందనని ఫస్ట్ ఛాయస్ గా దర్శక, నిర్మాతలు చూస్తున్నారు.