రష్మికని టాలీవుడ్ లైట్ తీసుకుందా..?
అసలు టాలీవుడ్ నుంచి రష్మికకు ఆఫర్లు ఎందుకు రావట్లేదు అంటే కథ విషయంలో క్యారెక్టర్స్ విషయంలో రష్మిక వివరాలు అడుగుతుందట.
By: Tupaki Desk | 10 Aug 2023 12:30 PM GMTకన్నడ భామ రష్మిక మందన్న టాలీవుడ్ లో దూకుడు తగ్గించిందని చెప్పొచ్చు. మొన్నటిదాకా వరుస స్టార్ ఛాన్స్ లతో ఊగిపోయిన అమ్మడు ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంది. అయితే తెలుగులో చేయకపోయినా బాలీవుడ్ లో సినిమాలు చేసిన రష్మిక ఇప్పుడు అక్కడ కూడా ఆఫర్లు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది. రష్మిక ప్రస్తుతం సందీప్ వంగా డైరెక్షన్ లో వస్తున్న యానిమల్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తో పాటుగా అల్లు అర్జున్ పుష్ప 2 లో కూడా నటిస్తుంది.
పుష్ప 1 సూపర్ హిట్ అవడంతో పుష్ప 2 పై అంచనాలు పెరిగాయి. అయితే పుష్ప 2 లో రష్మిక పాత్ర నిడివి చాలా తక్కువ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత రీసెంట్ గా రెయిన్ బో అని ఒక పాన్ ఇండియా ఫిమేల్ సెంట్రిక్ సినిమాను ఓకే చేసింది అమ్మడు. ఆ సినిమాల తర్వాత మరో ఆఫర్ రాలేదు. ఈమధ్యనే నితిన్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారింది.
అసలు నితిన్ సినిమా నుంచి రష్మిక ఎందుకు బయటకు వచ్చిందన్న రీజన్ ఇంతవరకు బయటకు రాలేదు. అయితే కొందరు అదంతా పబ్లిసిటీ కోసమే తప్ప నితిన్ సినిమాలో రష్మిక చేస్తుందని అంటున్నారు. భీష్మ కాంబో లో వస్తున్న ఈ సినిమా మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. అసలు టాలీవుడ్ నుంచి రష్మికకు ఆఫర్లు ఎందుకు రావట్లేదు అంటే కథ విషయంలో క్యారెక్టర్స్ విషయంలో రష్మిక వివరాలు అడుగుతుందట.
అంతేకాదు రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. అందుకే రష్మికని కాదని ఆమె ప్లేస్ లో కొత్త హీరోయిన్స్ ను.. ఇప్పుడు ఫాం లో ఉన్న కథానాయికలను తీసుకుంటున్నారు. ఎవరితో చేసినా చేయకపోయినా రష్మిక మళ్లీ విజయ్ తో కలిసి నటిస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. నేషనల్ క్రష్ అయిన రష్మిక ఇలా సడెన్ గా చేతిలో సినిమాలు లేక ఖాళీ అవడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.
ఓ పక్క రోజుకొక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైం లో ఆల్రెడీ ఫాం లో ఉన్న భామలు ఇలా సినిమాలకు బ్రేక్ ఇస్తే వారి గ్రాఫ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించి హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు.