Begin typing your search above and press return to search.

రష్మిక మందన్న 'ది గర్ల్ ఫ్రెండ్'

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.

By:  Tupaki Desk   |   22 Oct 2023 7:17 AM GMT
రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన. ఈ అమ్మడు వరుస ప్రాజెక్ట్స్ తో ఇటు సౌత్ లో అటు నార్త్ లో తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. హిందీలో రణబీర్ కపూర్ కి జోడీగా యానిమల్ చిత్రంలో రష్మిక నటించింది.

మూవీ డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది. తెలుగులో పుష్ప 2 మూవీ సెట్స్ పైన ఉంది. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ గా రెయిన్ బో అనే సినిమా ఒకటి చేస్తోంది. హిందీలో విక్కీ కౌశల్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇప్పుడు మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీ రష్మిక మందన నుంచి రాబోతోంది. అది కూడా గీతా ఆర్ట్స్ లాంటి ప్రస్టేజియస్ బ్యానర్ లో అందాల రాక్షసి సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రాహుల్ రవీంద్రన్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత చిలసౌ సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ చిత్రంలో సుశాంత్ హీరోగా నటించారు. మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత నాగార్జునతో మన్మథుడు 2 మూవీ చేశాడు.

ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. కింగ్ నాగార్జున ఇమేజ్ ని కూడా మన్మథుడు 2 డిస్టర్బ్ చేసింది. దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ కి ఇది పెద్ద ఎఫక్ట్. దీంతో దర్శకత్వానికి విరామం ఇచ్చి మళ్ళీ నటుడిగా బిజీ అయ్యే ప్రయత్నం చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓ వైపు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. చాలా గ్యాప్ తీసుకొని ఓ మంచి లవ్ స్టొరీ రెడీ చేసుకొని మరల దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.

గీతా ఆర్ట్స్ ఏకంగా అతనికి అవకాశం ఇచ్చింది. రష్మిక మందనని లీడ్ రోల్ గా తీసుకొని ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ తో ఈ సినిమాని తాజాగా ఎనౌన్స్ చేశారు. చిన్న వీడియో గ్లింప్స్ రష్మిక మందన తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి మూవీ కన్ఫర్మ్ చేసింది. ఖుషి సినిమాకి సంగీతం అందించిన అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు. త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని వీడియోలో కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రంలో ఒక అబ్బాయిని గొప్పగా ప్రేమించే అమ్మాయి గురించి రాహుల్ రవీంద్రన్ చెప్పబోతున్నట్లు గ్లింప్స్ వాయిస్ ఓవర్ బట్టి అర్ధమవుతోంది.