Begin typing your search above and press return to search.

రష్మిక పొరపాటు.. వైరల్‌ అయిన వీడియో

రష్మిక మందన్న తాజాగా యానిమల్ సినిమా సక్సెస్ వేడుకలో పాల్గొంది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 9:46 AM GMT
రష్మిక పొరపాటు.. వైరల్‌ అయిన వీడియో
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె పొరపాటు కారణంగా వార్తల్లో నిలిచింది. ఎయిర్ పోర్ట్‌ లో ఈ అమ్మడు రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎయిర్ పోర్ట్‌ లో రష్మిక కనిపించిన ప్రతిసారి మీడియా వారు ఆమెను చుట్టుముట్టడం కనిపించే విషయం.

రష్మిక మందన్న తాజాగా యానిమల్ సినిమా సక్సెస్ వేడుకలో పాల్గొంది. సమయంలోనే ఎయిర్‌ జర్నీ చేసింది. ఎయిర్‌ పోర్ట్‌ లో ఈ అమ్మడు మీడియా వారు చుట్టు ముట్టి, సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడటంతో హడావుడిగా ఎదురుగా ఉన్న కారును ఎక్కేందుకు ప్రయత్నించింది.

ఆ సమయంలో మేడం అది మన కారు కాదు.. ఇది మన కారు అంటూ ఆమె టీం నుంచి కొందరు అరవడంతో నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లి పోయి తన కారు ఎక్కింది. అభిమానులు మరియు మీడియా వారు హడావుడి చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అనేది కొందరి మాట.

యానిమల్ సినిమా తర్వాత రష్మిక క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ అమ్మడి యొక్క సినిమాలు మరిన్ని రాబోతున్నాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమాతో రష్మిక మరోసారి శ్రీవల్లిగా పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది