Begin typing your search above and press return to search.

వీడియో : రష్మిక 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' ఇలా మొదలైంది

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న వరుస సినిమాలతో జోరు మీదుంది. ఇటీవలే ఈమె హిందీలో చేసిన యానిమల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 6:14 AM GMT
వీడియో : రష్మిక ది గర్ల్‌ ఫ్రెండ్‌ ఇలా మొదలైంది
X

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న వరుస సినిమాలతో జోరు మీదుంది. ఇటీవలే ఈమె హిందీలో చేసిన యానిమల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణబీర్‌ కపూర్ కు జోడీగా నటించడంతో బాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది. యానిమల్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌ దక్కిన నేపథ్యంలో బాలీవుడ్‌ లో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరో వైపు ఈమె రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమా ది గర్ల్‌ ఫ్రెండ్‌ కు ఓకే చెప్పింది. తాజాగా ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. హైదరాబాద్‌ లో రెగ్యులర్‌ షూటింగ్‌ ను ప్రారంభించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఒక వీడియోను విడుదల చేసి రష్మిక ఫ్యాన్స్ కి గిఫ్ట్‌ గా ఇచ్చారు.

ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా షూటింగ్ లో రష్మిక జాయిన్‌ అయింది. మొదటి రోజు షూటింగ్‌ లో రష్మిక సింపుల్ పక్కింటి అమ్మాయి లుక్‌ లో కనిపించింది. బ్లూ టాప్‌ తో వైట్‌ పాయింట్‌ ధరించి లూజ్ హెయిర్ తో బుజం కు ఒక బ్యాగ్‌ తో రష్మిక సింపుల్‌ అండ్‌ స్వీట్‌ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గీతా ఆర్ట్స్‌, మాస్ మూవీ మేకర్స్‌, దీరజ్ మొగిలినేని ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించడంతో పాటు, కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అల్లు అరవింద్ ఈ సినిమాని సమర్పిస్తున్నాడు. మొదటి రోజు షూటింగ్ లో అల్లు అరవింద్‌ ను చూడవచ్చు.

ఈ సినిమాలో చిన్న గెస్ట్‌ రోల్‌ ను పెద్ద హీరో చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ పెద్ద హీరో ఎవరు అనే విషయమై క్లారిటీ రాలేదు. కానీ విజయ్‌ దేవరకొండ అయ్యి ఉంటాడు అంటూ మాత్రం చాలా మంది బలంగా వాదిస్తున్నారు. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.