Begin typing your search above and press return to search.

రష్మిక.. ఈ రేంజ్ లో ఊహించలేదు

మొదటి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదు.

By:  Tupaki Desk   |   2 Dec 2023 3:53 AM GMT
రష్మిక.. ఈ రేంజ్ లో ఊహించలేదు
X

స్టార్ హీరోయిన్ గా సౌత్ లో దూసుకుపోతోన్న అందాల భామ రష్మిక మందన తాజాగా బాలీవుడ్ మూవీ యానిమల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇది ఆమెకి మూడో హిందీ సినిమా. మొదటి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదు. అయితే మూడో సినిమాతో మాత్రం బాలీవుడ్ లో సత్తా చాటింది అని చెప్పొచ్చు.

రష్మిక మందన కేవలం గ్లామర్ రోల్స్ కి మాత్రమే కాకుండా మంచి పెర్ఫార్మెన్స్ అని గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చూస్తే తెలిసిపోతుంది. ఆ రెండు సినిమాలలో రష్మిక అద్భుతమైన నటనతో మెప్పించింది. గీతాగోవిందం సినిమాలో రష్మిక చేసిన పాత్ర అయితే ఆడియన్స్ ని చాలా కాలం వెంటాడింది. ఆ సినిమానే రష్మికని తెలుగులో స్టార్ హీరోయిన్ గా చేసింది.

ఇక బాలీవుడ్ లో కూడా సత్తా చాటడానికి సిద్ధమైన ఈ బ్యూటీకి యానిమల్ లో చేసిన కృతిక రోల్ మాత్రం మంచి ఇమేజ్ తీసుకొచ్చేలా ఉందని చెప్పొచ్చు. హీరో ఇమేజ్ మీద నడిచే మూవీ అయిన కూడా రణబీర్ కపూర్ భార్య పాత్రలో మంచి నటనకి స్కోప్ ఉన్న సీక్వెన్స్ లో రష్మిక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తో మెప్పించింది. ఆమె నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.

డియర్ కామ్రేడ్ తర్వాత ఇంత డెప్త్ ఉన్న పాత్ర ఈ మధ్యకాలంలో రష్మిక చేయలేదని చెప్పాలి. పుష్ప సినిమాలో నటనకి స్కోప్ ఉన్న పాత్ర అయిన అంతగా ఇంపార్టెన్స్ అయితే లేదు. సాంగ్స్, కొన్ని సన్నివేశాలకి మాత్రమే పరిమితం అయ్యింది. అయితే యానిమల్ సినిమాలో మాత్ర సందీప్ రెడ్డి వంగా పెర్ఫెక్ట్ గా రష్మిక క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు.

కేవలం రొమాంటిక్ సీన్స్ లొనే కాకుండా ఎమోషనల్ గా కూడా ఆమె 10 నిమిషాల సీన్ లో బెస్ట్ పెర్ఫెమెన్స్ ఇచ్చింది. రణబీర్ లాంటి హై ఎనర్జిటిక్ నటుడిని కొన్ని సీన్స్ లో డామినేట్ కూడా చేసిందనే చెప్పాలి. లిప్ లాక్ సీన్స్ లో కూడా చాలా నేచురల్ గా ఉండేలా హావభావాలతో కూడా షాక్ ఇచ్చింది.

ఆమె పాత్రని కూడా కథకు తగ్గట్టుగా సినిమాలో చాలా కీలంగా ఉపయోగించాడు. మొత్తానికి బాలీవుడ్ మూడో సినిమాతో రష్మిక మందన నటిగా ప్రశంసలు పొందడంతో సక్సెస్ కూడా అందుకున్నట్లే. మరి ఈ మూవీ ఆమె కెరియర్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూడాలి. యానిమల్ తర్వాత బాలీవుడ్ లో ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు అయితే పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.