అరెస్ట్ అయిన వ్యక్తిపై రష్మిక కామెంట్
ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక మందన్న ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తు ఇన్ స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.
By: Tupaki Desk | 21 Jan 2024 6:56 AM GMTనటి రష్మిక మందన్న డీప్ పేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆ వ్యక్తి వివరాలేవి మీడియాకి లీక్ చేయలేదు. అన్నింటిని గోప్యంగా ఉంచి విచారిస్తున్నారు. ఇంకా పలువురు నటీమణులకు కూడా డీప్ పేక్ బారిన పడటంతో వాటి వెనుక ఉన్న వారు? ఎవరు? అన్నది కూడా ఆరా తీస్తున్నారు. అన్ని వీడియోలు చేసింది ఒకడేనా? లేక వారు వేరేనా ? అని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక మందన్న ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తు ఇన్ స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. 'నాపై వచ్చిన డీప్ పేక్ వీడియో పట్ల అంతా ఎంతో అండగా నిలబడ్డారు. వాళ్లందరికి ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆ సమయంలో మీరు నాకెంతో రక్షణగా..అండగా నిలబడ్డారు. ఎవరి చిత్రాలైనా అనధికారికంగా ఉపయోగించడం అన్నది చాలా పెద్ద తప్పు. తాజా సన్నివేశం ఇలాంటి వీడియోలు సృష్టించే వారికి ఓ గుణపాఠంలా ఉండాలి. అది వారి జీవితాంతం గుర్తిండిపోయేలా ఉండాలని' ఆశిస్తున్నట్లు రాసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. రష్మిక డీప్ ఫేక్ బారిన పడటంతో అన్ని పరిశ్రమల నటులు ఆమెకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. తొలుత బిగ్ బీ అమితాబచ్చన్ ఈ వీడియోపై ఆవేదన వ్యక్తం చేసారు. అరెస్ట్ అయిన వ్యక్తి గుంటూరులో పోలీసులు పట్టుకున్నారు. అతడి వయసు 24 ఏళ్లు అని తెలుస్తోంది. నకిలీ వీడియోలు సృష్టికర్తగా అతడిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఢిల్లీ పోలీసుల తీరుపై రష్మిక మందన్న అభిమానులు- నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత, ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు గుంటూరులో ఉన్న 24 ఏళ్ల యువకుడిని పట్టుకు న్నారు. నకిలీ వీడియో వెనుక సృష్టికర్తగా గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసుల తీరుపై రష్మిక మందన్న అభిమానులు.. నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.