అమ్మాయిలకు రష్మిక డీఫ్ ఫేక్ హెచ్చరిక!
తాజాగా రష్మిక డీఫ్ పేక్ పై మరోసారి స్పందించింది. 'ఇలాంటి వీడియోలు ఎంతో ఒత్తిడిని కలిగిస్తాయని.. ప్రజల్లో వీటిపై అవగాహన కల్పించేందుకు మరోసారి మాట్లాడుతున్నానని' తెలిపింది.
By: Tupaki Desk | 1 Feb 2024 2:48 PM GMTనటి రష్మిక మందన్న డీప్ పేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ సమయంలో ఇన్ స్టాలో ఓ పోస్ట్ కూడా షేర్ చేసింది. 'నాపై వచ్చిన డీప్ పేక్ వీడియో పట్ల అంతా ఎంతో అండగా నిలబడ్డారు. వాళ్లందరికి ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆ సమయంలో మీరు నాకెంతో రక్షణగా..అండగా నిలబడ్డారు.
ఎవరి చిత్రాలైనా అనధికారికంగా ఉపయోగించడం అన్నది చాలా పెద్ద తప్పు. తాజా సన్నివేశం ఇలాంటి వీడియోలు సృష్టించే వారికి ఓ గుణపాఠంలా ఉండాలి. అది వారి జీవితాంతం గుర్తిండిపోయేలా ఉండాలని' ఆశిస్తున్నట్లు రాసుకొచ్చింది. తాజాగా రష్మిక డీఫ్ పేక్ పై మరోసారి స్పందించింది. 'ఇలాంటి వీడియోలు ఎంతో ఒత్తిడిని కలిగిస్తాయని.. ప్రజల్లో వీటిపై అవగాహన కల్పించేందుకు మరోసారి మాట్లాడుతున్నానని' తెలిపింది.
'కాలేజీ చదువుకునే అమ్మాయిలకు ఇలాంటిది జరిగితే వాళ్ల పరిస్థితి ఏంటి? అది ఊహించడానికి ఎంతో భయంగా ఉంది. ఆ కుటుంబాలు ఎంతగా క్షోభకు గురవుతాయి? వారిలో ధైర్యం నింపడానికే మళ్లీ మీ ముందుకొచ్చాను అని స్పందించింది. నిజమే సెలబ్రిటీలు ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుంది కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయగలరు. అదే సాధారణ అమ్మాయిల విషయంలో అలా జరిగి..అలాంటి వీడియోలు ట్రెండ్ అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో గెస్ చేయోచ్చు.
ఇలాంటి వాటిపై రష్మిక ఒక్కరే స్పందిస్తే సరిపోదు. మిగతా సెలబ్రిటీలు కూడా స్వచ్ఛందంగా ముందు కొచ్చి వాటిపై యువతలో అవగాహన కల్పించాలి. అవేర్ నెస్ కార్యక్రమాలు చేపట్టాలి. వాళ్లు చెబితే పబ్లిక్ లోకి వెళ్లడం ఈజీ అవుతుంది. జనాలకు రీచ్ అవ్వడం సులభం. సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో కూడా అవేర్ నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టాలి.