Begin typing your search above and press return to search.

రష్మిక వాలు జ‌డ వీపందం కిల్లింగ్

ఆ భారీత‌నం నిండిన ఆభ‌ర‌ణాలు.. చేతి గాజులు.. వేలికి ఉంగ‌రాలు.. మెడ‌లో అలంకారాలు.. అంత‌కుమించి సాంప్ర‌దాయ చీర‌క‌ట్టు

By:  Tupaki Desk   |   14 July 2024 6:05 AM GMT
రష్మిక వాలు జ‌డ వీపందం కిల్లింగ్
X

ఆ భారీత‌నం నిండిన ఆభ‌ర‌ణాలు.. చేతి గాజులు.. వేలికి ఉంగ‌రాలు.. మెడ‌లో అలంకారాలు.. అంత‌కుమించి సాంప్ర‌దాయ చీర‌క‌ట్టు.. వీట‌న్నిటినీ ఆ జిలిబిలి న‌వ్వు డామినేట్ చేసేస్తోంది. ఒక‌దానికి మించి ఒక‌టిగా ఒంటిపై ఆభ‌ర‌ణాలు పోటీప‌డుతున్న త‌రుణంలో ఆ పొడ‌వాటి వాలు జ‌డ, వీపందం అన్నిటినీ అధిగ‌మించాయి. ఓవ‌రాల్ గా ర‌ష్మిక మంద‌న లుక్ స్ట‌న్నింగ్ అని పొగిడేయ‌ని వారు లేరు.

ర‌ష్మిక ఎంపిక చేసుకున్న గోల్డ్ క‌ల‌ర్ లెహంగా.. దానికి కాంబినేష‌న్ గా వైట్ అండ్ గోల్డ్ దుప‌ట్టా.. క్రిస్ట‌లైన్ డిజైన్ తో రూపొందించిన ప్ర‌త్యేక‌మైన ఈ వ‌స్త్రాలు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నాయి. ఎంపిక చేసుకున్న దుస్తుల‌కు త‌గ్గ‌ట్టుగానే ర‌ష్మిక మేక‌ప్ సంవిధానం అంద‌మైన చిరున‌వ్వు.. వాలు జ‌డ యాప్ట్ గా ఆక‌ర్షిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్‌గా మారుతోంది.

ఇంత‌కుముందే అంబానీల పెళ్లిలో సంద‌డి చేసిన ర‌ష్మిక మంద‌న ఇంత‌లోనే లుక్ ఛేంజ్ చేసి యువ‌త‌రాన్ని ఆక‌ర్షించింది. జూలై 12 శుక్రవారం తెల్లవారుజామున రష్మిక మందన్న ముంబైకి చేరుకుంది. అక్క‌డ త‌న అభిమానుల‌తో ఎంతో ఓపిగ్గా సెల్ఫీలు దిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే రష్మిక మందన్న త‌దుప‌రి ధనుష్‌తో కలిసి కుబేరలో కనిపించనుంది. ఎగ్జైట్‌మెంట్ స్థాయిని పెంచేందుకు మేకర్స్ వ‌రుస అప్‌డేట్‌లను షేర్ చేస్తున్నారు. తాజాగా రష్మిక ఈ చిత్రానికి సంబంధించిన తన ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసింది. కుబేరలో, ధనుష్ ఒక నిరాశ్రయుడిగా మొద‌లై చివరికి శక్తివంతమైన మాఫియా లార్డ్‌గా ఎదిగే పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో రష్మిక - ధనుష్‌లతో పాటు అక్కినేని నాగార్జున- జిమ్ సర్భ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కుబేర పాన్-ఇండియన్ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇది తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రతిభావంతులైన తారాగణం, ఆసక్తికరమైన కథాంశం, ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ వెర‌సి ఇది మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో నిలుస్తోంది.

అల్లు అర్జున్ - ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటించిన 'పుష్ప: ది రూల్' లోను రష్మిక తిరిగి శ్రీ‌వ‌ల్లిగా త‌న పాత్ర‌తో మైమ‌రిపించ‌నుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనంజయ, జగదీష్ ప్రతాప్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలోని స‌స్పెన్స్ చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'లోను ర‌ష్మిక న‌టిస్తోంది. ధీక్షిత్ శెట్టి సరసన కనిపిస్తుంది.