Begin typing your search above and press return to search.

KGF య‌ష్‌తో ర‌ష్మిక విభేధాలు వైదొల‌గలేదా?

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక‌ నిరంత‌రం ఏదో ఒక అంశంలో జాతీయ మీడియా హెడ్ లైన్స్‌లోకొస్తోంది.

By:  Tupaki Desk   |   26 Jun 2024 3:30 PM GMT
KGF య‌ష్‌తో ర‌ష్మిక విభేధాలు వైదొల‌గలేదా?
X

గాడ్‌ఫాదర్ లేకుండా పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకున్న అత్యంత విజయవంతమైన నాయిక‌గా రష్మిక మందన్న పేరు మార్మోగుతోంది. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక‌ నిరంత‌రం ఏదో ఒక అంశంలో జాతీయ మీడియా హెడ్ లైన్స్‌లోకొస్తోంది.

ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కన్నడ పరిశ్రమ నుంచి దాదాపు నిషేధం ఎదుర్కొన్నా.. స‌హ‌న‌టుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం అనంత‌రం పెళ్లి బ్రేక్ అయినా.. డీప్ ఫేక్ వీడియో బాధితురాలైనా కానీ.. ఈ బ్యూటీ వ్యక్తిగత- వృత్తిగ‌త‌ జీవితంలో హెడ్ లైన్స్ లోకొచ్చింది. ఇటీవల రష్మిక తన ఇన్‌స్టా స్టోరీలో విరాట్ కోహ్లి, యష్, క్రిస్టియానో రొనాల్డో వంటి ప్ర‌ముఖుల‌ విజయాల‌ను ప్ర‌స్థావిస్తూ ఒక‌ వీడియోను రీపోస్ట్ చేసింది.

అయితే ఇందులో ప్రత్యేకత ఏం ఉంది? అంటే... రష్మిక మందన్న ఈ వీడియోలో య‌ష్ స‌మ‌ర్థ‌త‌ను పొగిడేసింది. దీనిని ఇప్పుడు య‌ష్‌ అభిమానులు న‌మ్మ‌డం లేదు. నిజానికి ర‌ష్మిక‌- యష్‌ల మ‌ధ్య చిన్న పాటి పొర‌పొచ్చాలు గ‌తంలో ఉన్నాయి. 2017లో ఘ‌ట‌న అది. య‌ష్‌పై ర‌ష్మిక కామెంట్ ఒక‌టి సోషల్ మీడియాల్లో విధ్వంసం సృష్టించింది. కానీ ఇప్పుడు రష్మిక షేర్ చేసిన తాజా వీడియోలో యష్ హార్డ్ వర్క్ గురించి మాట్లాడటం అభిమానుల‌ను ఆక‌ర్షించింది. అత‌డి విజ‌యాన్ని ర‌ష్మిక ఎంత‌గానో స్ఫూర్తివంతం అని అంది. 2017లో ఓ ఇంటర్వ్యూలో యష్‌పై చేసిన వ్యాఖ్యలకు రష్మిక మందన్నపై తీవ్ర విమ‌ర్శ‌లొచ్చాయి. ఆ సమయంలో య‌ష్ అభిమానులు ర‌ష్మిక‌ను తీవ్రంగా ట్రోల్ చేసారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో ``మిస్టర్ షో ఆఫ్ ఎవరు?`` అని రష్మికను ప్ర‌శ్నించ‌గా.. దీనిపై స్పందించిన ర‌ష్మిక‌ యష్ పేరును సూచించింది. ఆ త‌ర్వాత ర‌ష్మిక మందన్న తన ఫేస్‌బుక్ ఖాతాలో హృదయపూర్వక క్షమాపణల‌తో ఒక‌ లేఖను షేర్ చేసింది. ``నేను మీ మనోభావాలను దెబ్బతీస్తే క్షమించండి. అది నా ఉద్దేశ్యం కాదు. నా పెంపకం నన్ను ఇలా చేయనివ్వదు. నా ఇతర ఇంటర్వ్యూలు ఎఫ్‌బిని పరిశీలించమని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను, అక్కడ నేను యష్ సర్ పనిని మెచ్చుకున్నాను. నేను అత‌డితో కలిసి పని చేయాలనే కోరికను కూడా వ్యక్తం చేశాను`` అని ఆవేద‌న‌గా వేడుకుంది ర‌ష్మిక‌.

రష్మిక మందన్న- యష్ నెక్ట్స్‌ ఏంటి?

యష్ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీ. తొలిగా గీతూ మోహన్‌దాస్ `టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్` లో న‌టిస్తున్నాడు. ఇంతకుముందే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాడు. 10 ఏప్రిల్ 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ యాక్షన్ సినిమా కథ గోవాలో డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇదే కాకుండా యష్ KGF 3 లో కూడా కనిపిస్తాడు. ఫ్రాంచైజీ మొదటి రెండు భాగాలు విజయం సాధించిన తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ మూడవ భాగం తెర‌కెక్కిస్తాన‌ని అధికారికంగా ధృవీకరించారు.

మరోవైపు రష్మిక మందన్న కూడా వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. చి.ల.సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్‌ఫ్రెండ్‌లో ధీక్షిత్ శెట్టి స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తోంది. ధనుష్ `కుబేర`లో రష్మిక క‌థానాయిక‌. అల్లు అర్జున్‌తో పుష్ప 2: ది రూల్‌లో కనిపించనుంది. ఆగస్ట్ 15న విడుదల కావాల్సిన ఈ సీక్వెల్ డిసెంబర్ 6కి వాయిదా పడిన సంగ‌తి విధిత‌మే. విక్కీ కౌశల్ స‌ర‌స‌న `చావా`లో.. సల్మాన్ ఖాన్‌తో AR మురుగదాస్ `సికందర్‌`లోను ర‌ష్మిక న‌టిస్తోంది.