Begin typing your search above and press return to search.

అతడితో రష్మిక ర్యాంప్‌వాక్ వైరల్‌

ఢిల్లీలో జరిగిన ఇండియా కోచర్ వీక్ 2024 లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో విక్కీ కౌశల్‌ మరియు రష్మిక మందన్న చేసిన ర్యాంప్ వాక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   1 Aug 2024 6:09 AM GMT
అతడితో రష్మిక ర్యాంప్‌వాక్ వైరల్‌
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈసారి రష్మిక బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ విక్కీ కౌశల్ తో కలిసి ర్యాంప్ వాక్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. వీరి జోడీ ర్యాంప్‌ వాక్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం విక్కీ కౌశల్ తో కలిసి ఛావా అనే సినిమాలో ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఢిల్లీలో జరిగిన ఇండియా కోచర్ వీక్ 2024 లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో విక్కీ కౌశల్‌ మరియు రష్మిక మందన్న చేసిన ర్యాంప్ వాక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

బాలీవుడ్‌ ప్రముఖ తారలు పాల్గొన్న ఇండియా కోచర్ వీక్‌ కార్యక్రమంలో రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నడుము అందం చూపిస్తూ, క్లీ వేజ్‌ షో తో ఈ అమ్మడు చేసిన షోకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అద్భుతమైన ఔట్‌ ఫిట్ తో రష్మిక కన్నుల విందు చేసింది.

విక్కీ కౌశల్‌ కూడా డిఫరెంట్‌ ఔట్‌ ఫిట్ తో రష్మిక మందన్న కి ఏమాత్రం తగ్గకుండా అమ్మాయిల మనసు దోచే విధంగా కనిపించాడు. మొత్తానికి వీరిద్దరు కూడా జంటగా కనిపించడం ద్వారా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యారు.

ప్రస్తుతం రష్మిక మందన్న అరడజను సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఈ అమ్మడు చేస్తున్న పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ లో ఆ సినిమా విడుదల అవ్వబోతుంది. ఇక రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటిస్తుంది.

యానిమల్‌ సినిమా తర్వాత బాలీవుడ్‌ లో ఈ అమ్మడికి మంచి డిమాండ్ క్రియేట్‌ అయ్యింది. అందుకు తగ్గట్లుగానే ఈ అమ్మడు అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అక్కడ మరో రెండు హిట్స్ పడితే బాలీవుడ్‌ కే పూర్తిగా ఈ అమ్మడు పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.