Begin typing your search above and press return to search.

రష్మిక భాష.. ఆసక్తికర చర్చ

కానీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్‌ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యాయి.

By:  Tupaki Desk   |   28 May 2024 12:36 PM GMT
రష్మిక భాష.. ఆసక్తికర చర్చ
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్‌ లో యానిమల్‌ సినిమా తో మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకు ముందు కూడా బాలీవుడ్‌ లో ఈ అమ్మడు సినిమాలు చేసింది. కానీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్‌ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యాయి.

యానిమల్ సినిమా సూపర్‌ హిట్ అవ్వడంతో రష్మిక మందన్న కి పాన్ ఇండియా స్థాయిలో ముఖ్యంగా ఉత్తరాదిన భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. అక్కడ రష్మిక నుంచి వరుస సినిమాలకు డిమాండ్‌ వినిపిస్తుంది. అక్కడ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కు ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా తాజాగా ఒక సంఘటన జరిగింది.

రష్మిక మందన్న తాజాగా ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన గంగం గణేశా సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొంది. ఆ వేడుకలో రష్మిక మందన్న మాట్లాడిన వీడియో లు మరియు ఫోటోలు వైరల్‌ అయ్యాయి. వాటిని షేర్ చేసిన ఒక ఉత్తరాది ఫ్యాన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఢిల్లీకి చెందిన ఒక అభిమాని మీరు నిన్నటి ఈవెంట్‌ లో చాలా అందంగా కనిపించారు. అయితే మీరు మాట్లాడిన మాటలు మాత్రం మాకు అర్థం కాలేదు. మీకు సౌత్‌ లోనే కాకుండా నార్త్‌ లో కూడా అభిమానులు ఉన్నారు అనే విషయాన్ని గుర్తించి దయచేసి ఇంగ్లీష్ లో మాట్లాడండి అంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది.

సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్‌ చేసిన విజ్ఞప్తి పై రష్మిక మందన్న స్పందించింది. మీరు ఏ ప్రాంతం వారు అయినా నా మాటలు మీకు అర్థం అయ్యే విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి నేను చేరువ అవ్వాలి అనుకుంటాను.

ఎక్కడి ప్రేక్షకులు అయినా వారి స్థానిక భాష లో మేము మాట్లాడాలి అని కోరుకుంటారు. కనుక వారి సంతోషం కోసం అప్పుడప్పుడు లోకల్‌ భాష లో మాట్లాడాల్సి ఉంటుంది అన్నట్లుగా రష్మిక మందన్న పేర్కొంది. ముందు ముందు అందరికీ అర్థం అయ్యే విధంగా మాట్లాడుతాను అంటూ రష్మిక హామీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈమె కనిపించబోతున్న పుష్ప 2 సెకండ్‌ సింగిల్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు ఈ అమ్మడు తమిళం, హిందీల్లో పలు భాషల్లో నటించడంతో పాటు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు కూడా చేస్తూ బిజీ బిజీగా ఉంది.