Begin typing your search above and press return to search.

కొడ‌గు స్టైల్లో రష్మిక అందంగా ఈరోజు!

'మాది కూర్గ్ ప్రాంతం. మా ద‌గ్గ‌ర సంక్రాంతిని ప్ర‌కృతి పండ‌గ‌గా భావిస్తారు. ఇంట్లోనూ..పొలాల్లోనూ ఘ‌నంగా పూజ‌లు నిర్వ‌హిస్తారు. గోవుల‌ను కుటుంబ స‌భ్యులుగా భావించ‌డం మా అల‌వాటు.

By:  Tupaki Desk   |   15 Jan 2024 9:05 AM GMT
కొడ‌గు స్టైల్లో రష్మిక అందంగా ఈరోజు!
X

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న పండ‌గ‌లొచ్చినా...స్నేహితుల పెళ్లికి హాజ‌రైనా అమ్మ‌డి హంగామా అంతా ఇంతా కాదు. తానో పెద్ద హీరోయిన్ అన్న సంగ‌తి మ‌ర్చిపోయి చిన్న పిల్లలా మారిపోతుంది. సంద‌డంతా త‌న‌దే అంటోంది. ఆ రేంజ్ లో హంగామా చేస్తుంది. అందుకోసం ఎంతో అందంగా.. ప్ర‌త్యేకంగానూ ముస్తాబవుతుంది. మ‌రి ఈ సక్రాంతి స్పెష‌ల్ ఏంటి? అంటే త‌మ సంప్ర‌దాయ ప్రకారం చీరందంలో త‌ళ‌క్కున మెర‌వ‌డం అంటోంది. అవును.. ఆ సంగ‌తులేంటే ఆమె మాట‌ల్లోనే..

'మాది కూర్గ్ ప్రాంతం. మా ద‌గ్గ‌ర సంక్రాంతిని ప్ర‌కృతి పండ‌గ‌గా భావిస్తారు. ఇంట్లోనూ..పొలాల్లోనూ ఘ‌నంగా పూజ‌లు నిర్వ‌హిస్తారు. గోవుల‌ను కుటుంబ స‌భ్యులుగా భావించ‌డం మా అల‌వాటు. ఇరుగు పొరుగు వారికి స్వీట్లు పంచితే మంచి జ‌రుగుతుంద‌ని న‌మ్ముతాం.ఇక సంక్రాంతి రోజు చీర క‌ట్టుకోవ‌డం నాకు ఎంతో ఇష్ట‌మైన‌ది. కానీ ఇది మా సంప్ర‌దాయ ప‌ద్ద‌తి ప్ర‌కారం చీర క‌ట్టుకోవ‌డం ఉంటుంది. ప‌మిట చెంగును ఎడ‌మ చేతి నుంచి కుడి చేతి పై నుంచి ముందుకు వేసుకోవ‌డం మా అన‌వాయితీ.

అలా చీర‌క‌ట్టుకోవ‌డం అంటే నాకెంతో ఇష్టం. పండ‌గ స‌మ‌యంలోక‌చ్చితంగా నేను అమ్మానాన్న‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి కొడ‌గు స్టైల్ చీర క‌ట్టులోకి దూరిపోతా' అని అంది. మ‌రి ఈ సంక్రాంతి కి అమ్మ‌డు ఎలాంటి డిజైన్ సారీ ధ‌రించిందో చూడాలి. ఆ పోస్ట్ కోసం నేష‌న‌ల్ క్ర‌ష్ అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఓ సంద‌ర్భంలో త‌న ప్రాణ స్నేహితురాలి కోసం ఇదే స్టైలో ముస్తాబైన ఓఫోటోని అప్ప‌ట్లో పోస్ట్ చేసింది.

ఇక ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే 'యానిమ‌ల్' తో మ‌రో భారీ స‌క్సెస్ ని ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. అటు టాలీవుడ్..ఇటు బాలీవుడ్ అంటూ రెండు భాష‌ల్ని దున్నేస్తుంది. 'యానిమ‌ల్' విజ‌యంతో కొత్త అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. అక్క‌డా తిరుగులేని హీరోయిన్ గా ఎదుగుతుంద‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు.