భర్త ఉండగానే స్టార్ హీరోతో సుదూర ప్రేమ
ముఖ్యంగా రొమాంటిక్ లవ్ స్టోరీలతో యువతుల హృదయాలను కొల్లగొట్టిన కింగ్ ఖాన్ షారూఖ్ కి ప్రపంచవ్యాప్తంగా మహిళా అభిమానులు ఉన్నారు.
By: Tupaki Desk | 30 Dec 2024 4:30 PM GMTచాలామంది భార్యామణులు తమ స్టార్ క్రష్ గురించి ఓపెన్ గానే తమ భర్తలకు చెబుతుంటారు. పుష్పరాజ్ అంటే తమకు విపరీతమైన క్రష్ ఉందని కొందరు భర్తలకు భార్యలు చెప్పి ఉండొచ్చు. కానీ ప్రభాస్, షారూఖ్ లాంటి స్టార్ హీరోలకు మహిళా ఫాలోయింగ్ అసాధారణమైనది. వారి దూరం నుంచే ప్రేమిస్తుంటారు. ఫాంటసీలోకి వెళ్లిపోతుంటారు. ముఖ్యంగా రొమాంటిక్ లవ్ స్టోరీలతో యువతుల హృదయాలను కొల్లగొట్టిన కింగ్ ఖాన్ షారూఖ్ కి ప్రపంచవ్యాప్తంగా మహిళా అభిమానులు ఉన్నారు.
అతడి నడక, నడత, శైలి ప్రతిదీ ఎంతో ఆకర్షణీయమైనవి. అందువల్ల అతడితో ప్రేమలో పడని యువతులు లేనే లేరు. షారూఖ్ తో దేశవ్యాప్తంగా ఎందరో పడతులు ప్రేమలో పడ్డారు. అలా తాను కూడా ప్రేమలో పడ్డానని తెలిపారు పెళ్లయిన నటి రసిక దుగ్గల్. ఈ విషయాన్ని తన భర్త ముందే ఎలాంటి నామోషీ లేకుండా చెబుతారు. షారుఖ్‌తో తనకున్న బంధం సుదూర బంధం లాంటిదని రసిక తాజా ఇంటర్వ్యూలో వివరించారు. ఖాన్ ని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదని, అయితే డర్ , బాజీగర్ వంటి చిత్రాలను చూసి అతడితో ప్రేమలో పడ్డానని చెప్పింది. ఖాన్ కేవలం రొమాంటిక్ హీరో మాత్రమే కాదు.. అతడు నటించే ఏ సినిమా అయినా జీవితాంతం గుర్తుంటాయని రసిక తెలిపారు. ఖాన్ పై అన్ కండిషనల్ లవ్ ని ప్రదర్శించారు ఆమె. తనకు భర్త ఉన్నా కానీ, షారూఖ్ కోసం సిగ్గు విడిచిపెడతానని సూచనప్రాయంగా అన్నారు.
భర్తతో తన బంధం గురించి కూడా రసిక ఓపెనైంది. వారి తొలి సమావేశం గురించి వెల్లడిస్తూ ఆరంభం తమకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసుకున్నట్టు వెల్లడించారు. రసిక -ముకుల్ ఒక థియేటర్ వర్క్‌షాప్‌లో కలుసుకున్నారు. ప్రారంభ సమావేశం అంతంత మాత్రమే. ప్రతి ఆదివారం ఉదయం వారు ఒక సెషన్ కోసం కలుస్తుండేవారు. ఒక శనివారం లంచ్ కి హాజరైన 15 మందిలో ముకుల్ కూడా ఉన్నారు. లంచ్ సమయంలో కబుర్లు చెప్పుకున్న తర్వాత, రసిక - ముకుల్ తమకు చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని గ్రహించారు. వారి స్నేహం ప్రేమగా మారింది. తర్వాత పెళ్లయింది. రసిక దుగ్గల్ ఇప్పుడు 14వ వార్షికోత్సవంలోను ఆనందంగా కలిసి ఉన్నారు. షారూఖ్ కి దూరంగా ఉంటున్నా కానీ తనతో నిరంతరం ప్రేమలోనే ఉంది రసిక. ఈ నటి హిందీ చిత్రసీమకు సుపరిచితురాలు. ఓటీటీలోను పలు వెబ్ సిరీస్ లలో నటించారు. రసికా దుగల్ భారతీయ సినిమా నటి. 2007లో `అన్వర్` సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మీర్జాపూర్, ఢిల్లీ క్రైమ్ (2019), అధుర(2023) వెబ్‌సిరీస్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.