Begin typing your search above and press return to search.

ఆ దెబ్బ‌కు 'ర‌త‌న్ టాటా' సినీ ఇండ‌స్ట్రీనే వ‌దిలేశారు!

సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించే వారిలో కొంత‌ భాగం పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపారులు అనే విష‌యం తెలిసిన‌దే.

By:  Tupaki Desk   |   30 Sep 2024 4:06 AM GMT
ఆ దెబ్బ‌కు ర‌త‌న్ టాటా సినీ ఇండ‌స్ట్రీనే వ‌దిలేశారు!
X

సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించే వారిలో కొంత‌ భాగం పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపారులు అనే విష‌యం తెలిసిన‌దే. టాటా గ్రూప్‌ను 33 లక్షల కోట్ల నిక‌ర విలువ‌తో భార‌త‌దేశంలోనే అతిపెద్ద‌ గ్రూప్ గా నిర్మించడంలో భారతదేశపు అత్యంత ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచిన ప్ర‌ముఖుడు ర‌త‌న్ టాటా సినీరంగంలోకి ప్ర‌వేశించారు. టాటా గ్రూప్ ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ పవర్, హోటల్, రిటైల్ ఐటి, రియల్ ఎస్టేట్ రంగాలు సహా అనేక రకాల వ్యాపార సామ్రాజ్యాల‌కు అత‌డు సృష్టిక‌ర్త‌గా వెలిగిపోయిన‌ ది గ్రేట్ ర‌త‌న్ టాటా త‌ప్ప‌ట‌డుగు వేసారు.

ర‌త‌న్ జీ తన కెరీర్‌లో ఒకానొక సమయంలో సినీ ప‌రిశ్ర‌మ‌ను టచ్ చేసాడు. కానీ ఇక్క‌డ ల‌క్ క‌లిసిరాలేదు. అత‌డి ప‌న్నాగాలు ఫ‌లించ‌లేదు. దీంతో ఫ్లాప్ అయ్యారు. బాలీవుడ్ ఫిల్మ్ ప్రొడక్షన్‌లో టాటా ప్ర‌వేశం ఈరోజుల్లో ఎవ‌రికీ గుర్తు లేదు. ఎల్ల‌పుడూ లాభాల బాట‌లో ఉండే వెంచర్‌లన్నింటికీ విరుద్ధంగా వ్యాపార దిగ్గజం ర‌త‌న్ టాటా సినీనిర్మాణంలో అడుగుపెట్టి సాహ‌సం చేసారు. ఆరంభ‌మే ఫెయిల‌య్యారు. అతడు నిర్మించిన‌ మొదటి ఏకైక చిత్రం `ఏత్‌బార్` లో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు వంటి అగ్ర‌తారాగ‌ణం న‌టించారు. 2000ల ప్రారంభంలో సినిమా వ్యాపారంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు టాటా. భారీ అంచనాల న‌డుమ విడుద‌లైన‌ ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ అయ్యింది. ఆ ఒక్క ప‌రాజ‌యంతో నిర్మాతగా రతన్ టాటా ఇక సినీరంగం వైపు క‌న్నెత్తి చూడ‌లేదు.

ఏత్‌బార్ 2004లో విడుద‌లైంది. అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాషా బసు, సుప్రియా పిల్‌గావ్‌కర్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. రతన్ టాటా సహ-నిర్మాత. 1996 హాలీవుడ్ చిత్రం ఫియర్ ఆధారంగా ఇది రూపొందింది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఏత్‌బార్ డాక్టర్ రణవీర్ మల్హోత్రా (అమితాబ్ బచ్చన్) కథ.. అత‌డి అమాయక కుమార్తె రియా మల్హోత్రా (బిపాసా బసు)ని బ‌లాత్కార‌పు ప్రేమికుడు ఆర్యన్ త్రివేది (జాన్ అబ్రహం) నుండి రక్షించడానికి ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతాడు. రణవీర్ ఈ ప్ర‌యాణంలో ఆర్యన్ కి సంబంధించిన ఒక‌ భయంకరమైన గతం గురించి తెలుసుకుంటాడు. అత‌డు సమస్యాత్మకమైన వ్యక్తి. దీంతో ర‌ణవీర్ అత‌డి గతాన్ని మరింత లోతుగా పరిశోధిస్తాడు. కానీ రియాకు ఇప్పటికీ ఆర్యన్ అంటే అవ్. దీంతో వారి కుటుంబంలో చీలిక ఏర్ప‌డుతుంది. ఏత్‌బార్ గొప్ప స్క్రిప్టు ఉన్న సినిమానే అయినా ప్ర‌శంస‌లు ద‌క్కినా కానీ.. బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని 9.50 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. బాక్సాఫీస్ ఇండియా ప్రకారం.. ఏత్‌బార్ బాక్సాఫీస్ వ‌ద్ద బ‌డ్జెట్లో స‌గం వ‌సూళ్ల‌ను సాధించినా నిరాశ‌ప‌రిచింది. ఆ త‌ర్వాత ర‌త‌న్ టాటా సినిమా రంగం వైపు చూడ‌లేదు.