భగవంత్ కేసరిలో బిగ్ బాస్ పాప.. థియేటర్లు గోల గోల
ఈ సినిమాలో రతిక ఒక మహిళా మంత్రి పాత్రలో కనిపించింది. ఇంగ్లీష్‌లో మాట్లాడే మంత్రిగా నవ్వులు పూయించిందట.
By: Tupaki Desk | 19 Oct 2023 12:00 PM GMTస్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి.. దసరా సంధర్భంగా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి షో నుంచే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటించారు. వీళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయింది.
అయితే వీళ్లతో పాటు ఇప్పటివరకు ప్రచారంలో లేని మరో పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అది మరెవరో కాదు నటించింది.. తెలుగు అమ్మాయి, బిగ్‌బాస్ బ్యూటీ రతికా రోజ్. ఈ సినిమాలో రతిక ఒక మహిళా మంత్రి పాత్రలో కనిపించింది. ఇంగ్లీష్‌లో మాట్లాడే మంత్రిగా నవ్వులు పూయించిందట.
అసలు ఆమె చిత్రంలో ఉన్నట్టు రిలీజ్ అయ్యేంతవరకు ఎవరికీ తెలీదు. ఊహించని విధంగా ఇప్పుడు అకస్మాతుగా ఆమెను స్క్రీన్‌పై చూసి ప్రేక్షకులు థియేటర్లో అరిచి గోల చేస్తున్నారు. వాస్తవానికి ఈ బ్యూటీ నటించింది చిన్న పాత్రే అయినప్పటికీ.. రతికకు ఇలాంటి సమయంలో స్క్రీన్‌పై కనిపించడం మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఒకవేళ బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లక పోయి ఉంటే మాత్రం... ఆమెను ఎవరూ గుర్తు పట్టేవారు కూడా కాదు. బిగ్‌బాస్ హౌజ్తోనే ఆమెకు ఈ గుర్తింపు తెచ్చింది. అందుకే జనాలు. ఆమెను ఇట్టే గుర్తు పెట్టేస్తున్నారు
ఇకపోతే బిగ్ బాస్ 7 హౌస్ లోకి వచ్చిన నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయింది రతిక. హౌజ్‌లో మెదట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉండి.. గేమ్‌లు, టాస్క్‌లు బాగానే ఆడేది. కానీ ఆ తర్వాత మాజీ బాయ్‌ఫ్రెండ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో దిగిన ఫోటోలు బయటకు రావడం, వాటిని సింపతీకి వాడుకోవడం వంటివి చేసింది.
హౌజ్‌లోనూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో ముందు ప్రేమాయణం నడపడం, ఆ తర్వాత అతడితో మాటల యుద్ధం నడపడం, అనంతరం యావర్ విషయంలోనూ ఇదే జరగడం.. వంటి సంఘటనలు ఆమెపై తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ఎలిమినేట్ అయిపోయింది.