Begin typing your search above and press return to search.

'దేవర' అప్‌డేట్ ఇచ్చిన రత్నవేలు

ఆయన సెట్స్ కి సంబంధించిన ఫోటో ను షేర్ చేయడం తో పాటు మముత్ మిడ్ సీ నైట్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాం.

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:37 AM GMT
దేవర అప్‌డేట్ ఇచ్చిన రత్నవేలు
X

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న 'దేవర' సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది.. అసలు ఏం జరుగుతుందో తెలియక నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేమికులు జుట్టు పీక్కుంటున్నారు. ఎప్పుడెప్పుడు దేవర అప్డేట్‌ వస్తుందా అంటూ ఎదురు చూసిన వారి కోసం అన్నట్లుగా ఓ అప్డేట్‌ వచ్చింది.

దేవర సినిమా కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వర్క్ చేస్తున్నారు. గతంలో ఎన్నో అద్భుతమైన ఔట్‌ ఫుట్‌ లను ఇచ్చి కన్నుల విందు చేసిన రత్నవేలు మరోసారి దేవర సినిమా తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికుల కోసం ఒక విభిన్నమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్న ట్లు సమాచారం అందుతోంది.

తాజాగా ట్విట్టర్ ద్వారా రత్నవేలు 'దేవర' సినిమా కి సంబంధించిన అప్డేట్ ను ఇవ్వడం జరిగింది. ఆయన సెట్స్ కి సంబంధించిన ఫోటో ను షేర్ చేయడం తో పాటు మముత్ మిడ్ సీ నైట్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాం. తారక్ నీటి అడుగున మరియు భూపి పైన అద్భుతమైన సన్నివేశాలను చేయడం జరిగింది అంటూ ట్వీట్ చేశాడు.

రత్నవేలు చేసిన ట్వీట్ తో దేవర సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటికే ప్రకటించిన విధంగా సినిమా కచ్చితంగా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అవ్వబోతుంది అన్నట్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవర విడుదలకు ముందే హిందీ వార్ 2 లో ఎన్టీఆర్‌ నటించబోతున్న విషయం తెల్సిందే.